Samantha Raj: సమంత, దర్శకుడు రాజ్ నిడుమోరు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా వీళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ స్ప్రెడ్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ంలో రాజ్ మాజీ భార్య అలానే రాజ్ చెల్లెలు ప్రొఫైల్స్ కూడా వైరల్ అవ్వడం మొదలెత్తాయి..
సమంత, దర్శకుడు రాజ్ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి.. వీళ్ళిద్దరికీ సంబంధించిన.. వ్యక్తుల ప్రొఫైల్ కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా దర్శకులు రాజ్ మాజీ భార్య శ్యామల ప్రొఫైల్ పైన అందరి దృష్టిపడింది..
ఆమె చిన్న పోస్ట్ పెట్టినా కూడా అది కాస్త సోషల్ మీడియాలో చాలా పెద్దగా వైరల్ అవుతూ వచ్చింది. ఆమె కూడా ఎక్కువగా ప్రేమ, మోసం అనే టాపిక్స్ పైన పెట్టడంతో.. అవన్నీ కూడా సమంత పైన కౌంటర్లే అంటూ అందరూ అనుకున్నారు.
అందరూ భావించినట్లే సమంత పెళ్లవ్వగానే.. నేను రాత్రంతా నిద్రపోలేదు అంటూ.. నాకు ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అంటూ మాజీ భార్య పోస్ట్ పెట్టడం మరింత వైరల్ అయింది.
ఇక రాజ్ మాజీ భార్యతో పాటు రాజ్ సోదరి సీతల్ నిడుమోరి ప్రొఫైల్ కూడా వైరల్ అవుతూ ఉంది. పెళ్లి అవ్వగానే సమంత రాజ్ సోదరికి ఐ లవ్ యు అని పోస్ట్ పెట్టిన దగ్గర నుంచి ఈ ప్రొఫైల్ పైన అభిమానుల దృష్టిపడింది..
ఈ క్రమంలో శీతల్ తన ఫ్యామిలీతో పాటు సమంత, రాజ్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ప్రేమని పంచుకున్నప్పుడే ప్రేమ రెట్టింపు అవుతుంది.. వీళ్ళకి శతమానం భవతి అంటూ దీవించండి అని శతమానం భవతి సినిమాలో సాంగ్ కూడా పెట్టింది.
దీంతో రాజ్ మాజీ భార్య ఫ్యామిలీతో కలిసి ఉండేది కాదేమో.. అందుకే సమంతతో కలిసి రాజ్ చెల్లెలు ఇలాంటి కౌంటర్ ఇచ్చే కామెంట్ పెట్టిందేమో అని భావిస్తున్నారు కొందరు.