Add Zee Business As A Preferred Source
App

Samantha Marriage Pics: సమంత రెండో పెళ్లి అఫిషియల్.. పిక్స్ షేర్ చేసిన సామ్..!

Written ByAruna Maharaju
Published: Dec 01, 2025, 02:08 PM IST|Updated: Dec 01, 2025, 05:51 PM IST

Samantha Marriage Photos: కొంతకాలంగా ప్రేమలో ఉన్న సమంత, రాజ్ నిడిమోరు ఎట్టకేలకు.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుక కోయంబత్తూర్ లోని ఇషా యోగ సెంటర్ లో ఉన్న భైరవి ఆలయంలో జరిగింది. తాజాగా పెళ్లి ఫొటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ గా మారాయి.
 

1/5

సమంత, రాజ్ నిడిమోరు కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత రాజ్ తో ప్రేమలో పడింది. అయితే తమ రిలేషన్ గురించి సమంత ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. కానీ రాజ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ వచ్చింది. 

2/5

దీనితో సమంత, రాజ్ ప్రేమలో ఉన్నారని అంతా భావించారు. సమంత మరోసారి ఎప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చేసింది.   

3/5

ఈరోజు ఉదయం సమంత, రాజ్ నిడిమోరు వివాహం చేసుకొని.. అఫీషియల్ గా దంపతులు అయ్యారు. ఈ వేడుక కోయంబత్తూర్ లోని ఇషా యోగ సెంటర్ లో జరిగింది. 

4/5

ఇషా యోగా సెంటర్ లో ఉన్న భైరవి ఆలయంలో సమంత, రాజ్ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.     

5/5

తాజాగా సమంత తన పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. కేవలం కొన్ని క్షణాల్లోనే అవి వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన సమంత ఫ్యాన్స్, నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు.. ఈ జంటకు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.