Samantha: ఆ స్పెషల్ వ్యక్తితో గడపడమే గత సంవత్సరం మొత్తానికి నా మధురమైన క్షణాలు : సమంత

Samantha personal life: టాలీవుడ్ స్టార్ సమంతా రూత్ ప్రభు నిత్యం ఫ్యాషన్ ట్రెండ్స్‌ను సెట్ చేస్తూ ముందంజలో ఉంటారు. ఆమె సింపుల్ యాక్సెసరీస్‌ను ఎంచుకుంటూ, స్టేట్‌మెంట్ పీసులతో తన లుక్‌ను ప్రత్యేకంగా మార్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సమంత తాజాగా తన ఫ్యాషన్ తో పాటు షేర్ చేసిన కొన్ని ఫోటోలు పెట్టిన క్యాప్షన్ తెగ వైరల్ అవుతుంది.

1 /5

సమంత ఇటీవల ఆమె గ్రేజియా ఫ్యాషన్ అవార్డ్స్ 2025లో పాల్గొని, క్రేషా బజాజ్ డిజైన్ చేసిన బ్లాక్ కార్సెట్ స్టైల్ డ్రెస్‌లో మెరిసిపోయారు. ఈ మధ్యనే ఆరోగ్యపరంగా కోలుకున్న సమంత సినిమాలతో పాటు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఉంది. ఈ క్రమంలో ఆమె ఈ అవార్డు ఫంక్షన్ కి అటెండ్ అయ్యింది.

2 /5

ఇక ఈ ఈవెంట్ లోని ఫోటోలు ఆమె షేర్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ క్యాప్షన్ లో ఆమె గత సంవత్సరం మొత్తానికి కూడా ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏమిటి.. ఇంకా ఎవరితో అన్న విషయాన్ని పంచుకున్నారు.

3 /5

సోషల్ మీడియాలో సమంత తన స్ స్నేహితురాలైన ఫ్యాషన్ డిజైనర్ తో..ఫోటోస్ షేర్ చేస్తూ, “గత ఏడాది ఎన్నో కొత్త అనుభవాలు ఇచ్చింది. కానీ వాటిలో నా ఫేవరెట్ మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి డ్రెస్సింగ్ చేయడం. ఇది ప్రెజర్‌ని తగ్గించుకునే చిన్న ప్రయత్నం. నా చుట్టూ ప్రతిభావంతులు, దయగల, నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. వాళ్లు నన్ను ఎంతగానో వెనకేసుకొని వచ్చారు. ఇలాంటి మధురమైన క్షణాల్లో నన్ను అందంగా ప్రెజెంట్ చేయడానికి తోడ్పడ్డారు” అంటూ భావోద్వేగపూరితంగా రాశారు.  

4 /5

సమంత లుక్‌ని మేకప్ ఆర్టిస్ట్ అవ్ని రాంభియా, హెయిర్ స్టైలిస్ట్ దక్ష్ నిధి డిజైన్ చేశారు. ఫోటోగ్రఫీకి డిస్టోర్టెడ్ మెమోరీస్, అనుషా ప్రభు.. ఒన్ టూ సమ్‌తింగ్ టీం పనిచేసింది.  వారందరికీ కూడా సమంతా కృతజ్ఞతలు తెలిపింది.  

5 /5

ఇక సినిమాల విషయానికి వస్తే..సమంత ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి కుషి చిత్రంలో నటించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక త్వరలో ఆమె మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం సమంత మొదటి ప్రొడక్షన్ వెంచర్ కావడం విశేషం. ఆమె స్థాపించిన త్రలలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కుతోంది.