Samantha: ప్రియాంక చోప్రా స్థానంలో సమంత.. భారీ బడ్జెట్ సినిమాలో.. భారీ మార్పు..!

SSMB29: ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న SSMB29 సినిమాలో ముఖ్యమైన పాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.. ఇంతకీ విషయం ఏమిటి అంటే

1 /5

అల్లు అర్జున్.. అట్లీ సినిమా పైన ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈమధ్య అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారికంగా ప్రకటించగా.. ఈ చిత్రం పైన బన్నీ ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. 

2 /5

ముఖ్యంగా ఈ సినిమా దాదాపు 800 కోట్ల బడ్జెట్తో రావడంతో.. ఇండియాలోనే మూడో అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది కాబోతోంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించబోతోంది అన్న వార్త వైరల్ అయింది.   

3 /5

ఈ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ యాక్షన్ చేయబోతున్నారని.. ఇక మొదటి అల్లు అర్జున్కి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించనుంది అని వార్త తెగ వినిపించింది. అంతేకాకుండా ఈ మాట విన్న అల్లు అర్జున్ అభిమానులు కొందరు నిరాశ కూడా వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ పక్కన ప్రియాంక చోప్రా సరిపోదు అని కామెంట్స్ కూడా పెట్టారు 

4 /5

ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ గురించి ఒక కీలక విషయం వినిపిస్తోంది. అదేమిటి అంటే అట్లీ ప్రియాంక చోప్రా బదులు ఆ పాత్రకు సమంతను సంప్రదించినట్టు వినికిడి.

5 /5

సమంత కూడా ఈ సినిమాని ఒప్పుకునేతట్లే కనిపిస్తోందట. ఇంతకుముందు అల్లు అర్జున్.. సమంత కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కనిపించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ వస్తోంది అనడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.