Add Zee Business As A Preferred Source
App

Samantha: అతనితో అలాంటి చోట దొరికిపోయిన సమంత.. పెళ్లి కూడా కాకుండా ఎందుకిలా..?

Written ByVishnupriya
Published: Sep 24, 2025, 07:33 AM IST|Updated: Sep 24, 2025, 07:33 AM IST

Samantha Raj Nidimoru 
సమంత రూత్ ప్రభు వ్యక్తిగత జీవితం గురించి వార్తలు తరచూ హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె పేరు పలుమార్లు ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరుతో జత కడుతూ రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు తగ్గట్టుగానే.. అతనితో ఒక చోటు దగ్గర.. కనిపించి.. మరోసారి వార్తల్లో నిలుస్తోంది సమంత.
 

Samantha Personal Life 1/5

సమంత లవ్ ఫోటోలు

ది ఫ్యామిలీ మాన్.. సిటాడెల్: హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల ద్వారా పేరుపొందిన రాజ్‌తో సమంత సన్నిహితంగా ఉంటోందనే వార్తలు.. ఎన్నో రోజుల నుంచి.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Samantha Raj Nidimoru Spotted 2/5

సమంత రాజ్ రిలేషన్,

ఈ క్రమంలో మరోసారి ఈ జంట ఒక దగ్గర కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు అని వినికిరి. ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలో జిమ్ నుంచి కలిసి బయటకు వస్తూ సమంత–రాజ్ జంటను అభిమానులు గుర్తించారంట. ఇద్దరూ లైట్ పింక్ డ్రస్‌లలో ఒకే కారులో ఎక్కి వెళ్లిపోయారంట. ఇక ఈ వార్త ముంబై మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఏంటి సామ్ ఇలా జిమ్ కి.. కూడా అతని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా అంటూ కొంతమంది అభిమానులు వాపోతున్నారు.  

Samantha Gym Photos 3/5

సమంత జిమ్ ఫోటోలు,

ఈ సంఘటనతో మళ్లీ వారి సంబంధంపై ఊహాగానాలు వేడెక్కాయి. ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు అమెరికాలోని డెట్రాయిట్‌లో, ఆ తర్వాత ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో డిన్నర్ అవుటింగ్‌లో వీరిద్దరూ కలసి కనిపించారు. అలాగే సమంత నిర్మించిన శుభం సినిమా సందర్భంగా రాజ్ కూడా పక్కనే ఉండి సపోర్ట్ చేసినట్టు ఫోటోలు వైరల్ అవుతూ వచ్చాయి. ఆ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ఇద్దరూ ఒకే ఫ్లైట్‌లో వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఒక వీడియోలో సమంత రాజ్ భుజంపై తల వాల్చి ఉండటం మరింతగా ఊహాగానాలకు కారణమైంది.

 

          View this post on Instagram                      

A post shared by ShowMo (@showmo_india)

Samantha Personal Photos 4/5

సమంత రాజ్ నిడిమోరు,

ఇంకా ఆసక్తికరంగా, ఈ జంట తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను కలిసి దర్శించుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది. దీంతో అభిమానులు త్వరలోనే వారి సంబంధంపై “గుడ్ న్యూస్” వస్తుందేమోనని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మిగతావారు మాత్రం పెళ్లి వరకు ఆగొచ్చు కదా.. ఇలా ఎందుకు తిరుగుతూ ప్రతిసారి ఏవో ఒక ఫోటోను లీక్ చేయడం అని కూడా కామెంట్స్ చేస్తున్నారు

Samantha Love Photos 5/5

సమంత

ఇక రాజ్ నిడిమోరు విషయానికి వస్తే, ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వాసి. గతంలో ఆయన శ్యామల అనే మహిళను వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వారు విడిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్ సమంతను పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారన్న గాసిప్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు శ్యామల సోషల్ మీడియాలో నమ్మకం, విశ్వాసం గురించి పోస్టులు షేర్ చేయడం కూడా ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుస్తోంది.