Samantha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. ఫైనల్‌గా డేట్‌తో సహా క్లారిటీ ఇచ్చేసిందిగా.. వైరల్‌గా మారిన పోస్ట్..

Samantha Latest News: సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. బిగ్ స్క్రీన్ కు చాలా గ్యాప్ తీసుకున్న ఈ భామ..వరుస వెబ్ సిరిస్ లతో మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా.. సామ్ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట సందడిగా మారింది.
 

1 /6

సమంత రూత్ ప్రభు విజయ్ దేవర కొండతో కలిసి చివరి సారిగా ఖుషీలో కన్పించారు.  అయితే..ఈ భామ ఇటీవల ఎక్కువగా వెబ్ సిరిస్ లలో బిజీగా ఉంటున్నారు. సిటాడెల్ హనీబన్నీ అనుకున్న రెంజ్ లో సక్సెస్ కాకపోయిన సామ్ కు మాత్రం మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.  అదే ఊపులో సామ్ ప్రస్తుతం రక్త బ్రాహ్మాండ్ వెబ్ సిరిస్ లో బిజీగా ఉన్నారు.  

2 /6

ఇటీవల సామ్.. తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా పిక్చర్స్ ను కూడా ప్రారంభించారు. ఈ బ్యానర్ మీద శుభం చిత్రాన్ని కూడా తీస్తున్నారు.ఈ మూవీ టిజర్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. దీనికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. సమంత శుభం మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు.  

3 /6

ఇదిలా ఉండగా సమంత తాజాగా.. అభిమానులకు శుభంమూవీ రిలీజ్ పై కీలకమైన అప్ డేట్ ఇచ్చారు.  శుభం మూవీ మే 9న సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నట్లు సమంత తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. దీంతో శుభం మూవీ రీలీజ్ పై కొన్నిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్లైంది.  

4 /6

మరోవైపు సమంత పెళ్లిపై కూడా రకరకాల రూమర్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సామ్.. డేటింగ్ లో ఉన్నారని.. తొందరలోనే పెళ్లిపై శుభవార్త చెప్తారని కూడా నెట్టింట వార్తలు తెగ రచ్చగా మారాయి. అయితే.. దీనిపై సామ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఈ జంట మాత్రం తరచుగా ఇటీవల ఒకే చోట పలు ఈవెంట్ లలో కన్పిస్తుండటంతో నెటిజన్లు కూడా సమ్ థింగ్ ఈజ్ ఫిషీ.. అంటూ వీళ్లను ట్రోల్స్ చేస్తున్నారు.  

5 /6

అయితే.. సమంత ఇటీవల హీరో, హీరోయిన్ లకు వేర్వేరుగా రెమ్యురనరేషన్ ఇవ్వడంపై మాట్లాడారు. ఇద్దరు ఒకే విధంగా నటించినప్పుడు ఈ బేధం ఎందుకని అన్నారు. అదే విధంగా పీరియడ్స్ పై  కూడా ఇంకా జనాల్లో.. కుంచిత భావం పోలేదన్నారు. ఇప్పటికి చాలా మంది మహిళలు, అమ్మాయిలు పీరియడ్స్ గురించి మాట్లాడేందుకు అదేదో.. చెప్పకూడని విషయంగా భావిస్తారని సమంత అన్నారు.  

6 /6

కొన్నిరోజులుగా సమంత పెళ్లిపై నెట్టింట తెగ ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైతు, శొభితలు పెళ్లి చేసుకుని హానీమూన్ లలో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు సామ్ ఇంకా సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైతు, శొభితలు తమపిల్లల విషయంలో గుడ్ న్యూస్ చెప్పేకన్నా ముందు .. సమంతకు కనీసం పెళ్లి అయితే అంతే చాలని మరికొందరు వెరైటీగా కామెంట్లు చేస్తున్నారు.