Samantha: ప్రపంచంలోనే అలా చేసిన మొదటి మహిళగా సమంత..!

Samantha production house

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చి ఎదగాలి అంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టాలు ఎన్నో ఎదుర్కొని స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో సమంత ముందంజులో ఉంటుంది. ఈ క్రమంలో సమంత తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటుంది 

1 /5

కొన్ని సమస్యల వల్ల మధ్యలో కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్న సమంత.. ఇప్పుడు మళ్లీ వరస పెట్టి సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో తన తదుపరిచిత్రానికి తానే నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

2 /5

తన నిర్మాణ సంస్థ 'త్రలలా మూవింగ్ పిక్చర్స్' ద్వారా మొదటి సినిమాగా వస్తువున్న మా ఇంటి బంగారంలో సమంత హీరోయిన్గా కూడా చేస్తోంది. అయితే ఈ సినిమా ద్వారా ఒక గొప్ప పని చేసింది సమంత. ఈ చిత్రం ద్వారా.. సమంత నిర్మాతగా..సినీ పరిశ్రమలో సమాన వేతనాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె అందరికీ సమాన వేతనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  

3 /5

సినీ పరిశ్రమలో హీరోలకు ఎక్కువ పారితోషికం.. హీరోయిన్లకు తక్కువ పారితోషికం ఇవ్వడమే ఎన్నో రోజుల నుంచి వస్తోందా ఆనవాయితీ. అయితే, సమంత ఈ వ్యవస్థను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆమె తన తొలి ప్రొడక్షన్ హౌస్ ‘త్రలలా మూవింగ్ పిక్చర్స్’ ద్వారా అందరికీ సమాన వేతనాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

4 /5

సమంత నిర్మిస్తున్న తొలి చిత్రం ‘మా ఇంటి బంగారం’ అనే పాన్-ఇండియా మూవీ. ఇందులో పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ సమాన వేతనం ఇచ్చేలా ఆమె ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారు అని ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో దర్శకురాలు నందిని రెడ్డి తెలిపారు. ఇది సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టించనుంది. అంతేకాదు ఇలా చేసిన తొలి వ్యక్తిగా సమంత నిలవడం గమనర్హం. 

5 /5

సమంత త్రలలా మూవింగ్ పిక్చర్స్‌ సంస్థను ప్రారంభించడానికి ప్రధాన కారణం మహిళలకు, ఇతర తక్కువ వేతనాలు పొందే కళాకారులకు న్యాయమైన వేతనం అందించడమే అని కూడా తెలియజేశారు సమంత సన్నిహితురాలు నందిని. ఈ కొత్త విధానం ద్వారా ఇతర సినీ నిర్మాతలు కూడా స్ఫూర్తి పొందాలని సమంత ఆశిస్తున్నారు. వేతన వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా ఆదరణ పొందే రోజును చూడాలని ఆమె పేర్కొన్నారు. ఇది తెలుగు, తమిళ్, బాలీవుడ్ పరిశ్రమల్లోనూ మార్పు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమంత తీసుకున్న ఈ నిర్ణయం ముందు ముందు.. ఎందరికి లాభదాయకంగా నిలుస్తుందో వేచి చూడాలి.