Samantha: సమంత ఫోన్‌లో అతని ఫోన్ నెంబర్.. లవ్ అని ఫీడ్ చేసుకుని మరి..!

Samantha saved number as Love: సమంత ఫోన్‌లో 'లవ్' పేరుతో సేవ్ చేసిన నెంబర్ ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సోషల్ మీడియాలో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతని ఇంకా మర్చిపోలేకే ఈ హీరోయిన్ నెంబర్ అలా ఫీడ్ చేసుకుంది అని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ అతను ఎవరు అన్న విషయానికి వెళితే..

1 /5

స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లో తనదైన ముద్ర వేసుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుండి తన నటనతో అభిమానులను సంపాదించుకుంది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా, సమంత ఫోన్‌లో 'లవ్' అనే పేరుతో ఒక నెంబర్ సేవ్ చేసిందని సమాచారం.

2 /5

ఈ విషయం బయటకు వచ్చి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 'లవ్' పేరుతో ఎవరి నెంబర్ సేవ్ చేసిందో అనే విషయం తెలుసుకోవాలని నెటిజన్లు తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెంబర్ మరెవరిదో కాదు.. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు నెంబర్.

3 /5

సమంతకు తన తండ్రి అంటే ఎంతో ఇష్టం. గతేడాది ఆమె తండ్రి మరణించడంతో సమంత చాలా ఎమోషనల్ అయ్యింది. తన తండ్రిపై ఉన్న ప్రేమను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. "నాన్నా.. మీ లాంటి వారు ఇంకెవరూ రారు. మీరు లేకుండా నేనెలా?" అంటూ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టింది.  

4 /5

అయితే ఆయన మరణం తర్వాత కూడా ఆమె తన ఫోన్‌లో 'లవ్' పేరుతో నెంబరును సేవ్ చేయడం, ఆమె తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమను చూపిస్తుంది అని ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు సమంత అభిమానులు.

5 /5

కాగా ప్రస్తుతం సమంత ఆమెని నిర్మాణ సంస్థలో వస్తోన్న మా ఇంటి బంగారం సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. విజయ్ దేవరకొండ తో చేసిన ఖుషి సినిమా తర్వాత మరల సమంత కనిపిస్తున్న తెలుగు చిత్రం ఇదే.