Add Zee Business As A Preferred Source
App

Samantha Wedding: సమంత రెండో పెళ్లి.. మేకప్‌ స్టైలిస్ట్‌ షాకింగ్‌ ఇన్‌స్టా పోస్ట్‌..!

Written ByRenuka Godugu
Published: Dec 02, 2025, 12:08 PM IST|Updated: Dec 02, 2025, 12:54 PM IST

Samantha Raj Nidimoru Wedding: సమంత రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సామ్‌కు గతంలో మేకప్ స్టైలిస్ట్ గా పని చేసిన సాధన సింగ్ ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింటా రచ్చగా మారింది. సమంత రెండో వివాహం ఉద్దేశించి ఈ మేకప్ ఆర్టిస్ట్‌ పెట్టిందని అంటున్నారు. 'విక్టిమ్‌గా విలన్‌ బాగా నటించారు' అంటూ రాసుకొచ్చింది సాధన.  ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
 

Samantha Second Marriage1/5

 సమంత రెండో వివాహం

 సమంత రెండో వివాహం చేసుకుంది. ఆమె స్టార్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును నిన్న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అయిన రాజ్‌ నిడిమోరు పలు బాలీవుడ్ చిత్రాలు తీశారు. హీరోయిన్ సమంత పెళ్లి గురించి ఇన్స్టా పోస్ట్ కూడా చేసింది . దీంతో ప్రముఖులు, ఫ్యాన్స్ ఆమెకు విషెస్ కూడా చెప్పారు.  

Raj Nidimoru2/5

రాజ్‌ నిడిమోరు

 సమంత రాజ్‌ నిడిమోరు మధ్య ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2 సమయంలోనే ప్రేమ మొదలైనట్లు సినీ వర్గాలు కూడా తెలిపాయి. వారి పెళ్లి ఫోటోలు ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసిన 16 గంటల సమయంలోనే 79 లక్షలకు పైగా లైక్స్ కూడా రావడం గమనార్హం.    

Samantha Nagachaitanya3/5

 సమంత నాగచైతన్య

 సమంత నాగచైతన్యతో 2021లో విడాకులు తీసుకుంది. ఆతర్వాత నా ఈ అక్కినేని వారసుడు శోభితాను పెళ్లి చేసుకున్నారు. అయితే నిన్న సమంత రెండో వివాహం పై నటి పూనం కౌర్‌ కూడా పరోక్షంగా విమర్శలు చేసింది. వారి గూడుకట్టుకోవడానికి ఇంకొకరి ఇల్లు పడగొట్టడం బాధాకరం. బలహీనమైన నిరాశయులైన పురుషులను డబ్బుతో కొనవచ్చు, అహంకారపూరిత మహిళ అని పోస్ట్ చేసింది.  

Sadhana Singh4/5

సాధన సింగ్

తాజాగా సమంతకు మేకప్ స్టైలిస్ట్ గా పని చేసిన సాధన సింగ్ కూడా షాకింగ్ పోస్ట్ చేశారు. విక్టిమ్‌గా విలన్‌ బాగా నటించారు.. అంటూ సాధన సింగ్ రాసుకొచ్చింది. గతంలో వీరు క్లోజ్ గా ఉండేవారు.  అయితే ఇస్ మేకప్ స్టైలిస్ట్ సాధన సింగ్ సమంత ఒకరినొకరు ప్రస్తుతం ఫాలో కూడా అవడం లేదు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు.  

Samantha5/5

సమంత

అయితే సమంతపై ఈ కామెంట్స్ పెట్టడంతో సమంత ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు. సమంత వద్ద కొన్ని రోజులు పని చేసిన తన పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేయడం లేదే అని ప్రశ్నించారు. ఇక రాజ్ నిడిమోరుకు కూడా ఇది రెండో వివాహం.. ఆయన మొదటి భార్య శ్యామాలి.