Add Zee Business As A Preferred Source
App

Samantha: న్యూ బిగినింగ్స్ అంటూ సమంత పోస్ట్.. విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్ ఇలా.. రెండో పెళ్లి గురించేనా..!

Written ByAruna Maharaju
Published: Oct 02, 2025, 10:45 PM IST|Updated: Oct 03, 2025, 08:59 AM IST

Actress Samantha Good News: సమంత.. ఈ పేరు గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ.. రీసెంట్ టైమ్స్‌లో సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అయితే ఈ దసరా పండుగ రోజు ఓ గుడ్‌న్యూస్‌ని తన అభిమానులకు షేర్ చేసింది సమంత.  
 

Samantha Shares Good News1/7

సమంత గుడ్ న్యూస్

కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. ఇప్పుడిప్పుడే తిరిగి కెరియర్‌‌పై ఫోకస్ పెడుతుంది. ఇక డైలీ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసే సమంత.. తాజాగా తన అభిమానులకు ఓ తీపి వార్త చెప్పింది. 

Samantha Shares Good News2/7

గుడ్ న్యూస్ చెప్పిన సమంత

సమంత తన ఇన్‌స్టా ద్వారా న్యూ బిగినింగ్స్ అంటూ క్యాప్షన్ పెట్టి.. కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఇంటి మెయిన్ డోర్‌కి పూలతో అందంగా డెకరేషన్ చేయగా,  బయట సామ్ అని పేరు కూడా రాయించింది. ఇక ఈ ఫొటో చూస్తుంటే సమంత పక్కా కొత్త ఇంటినే కొనుగోలు చేసిందని తెలుస్తోంది.   

Actress Samantha3/7

గుడ్ న్యూస్ చెప్పిన సమంత

ఇక సమంత తన ఇల్లును ముంబైలో తీసుకుందా..? లేక హైదరాబాద్‌లో తీసుకుందా..? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ ఫొటోలు చూసిన సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు.. సమంతకు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Actress Samantha4/7

రాజ్ నిడిమోరు

మరోవైపు కొందరేమో న్యూ బిగినింగ్స్ అని క్యాప్షన్ పెట్టడం వెనుక పెళ్లి గురించి ఏమైనా గుడ్‌న్యూస్ ఉందేమో..? త్వరలో దాని గురించి కూడా సమంత చెప్తుందేమో అని తమ డౌట్స్‌ను కామెంట్స్ చేస్తున్నారు.  

Samantha Surprise Good News5/7

సమంత పెళ్లి

ఏదేమైనా ఇలా దసరా పండుగ రోజు సమంత మంచి శుభవార్తను చెప్పడంతో.. ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ అభిమాన నటి ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. 

Samantha Surprise Good News6/7

సర్‌ప్రైజ్ ఇచ్చిన సమంత

ఇకపోతే సమంత.. నాగచైతన్య నుంచి డివోర్స్ తీసుకున్న తర్వాత  డైరెక్టర్ రాజ్ నిడుమోరితో రిలేషన్‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య ఎక్కడా చూసిన వీరిద్దరే జంటగా కన్పిస్తున్నారు. అయితే దీనిపై ఇటు సమంత కానీ అటు రాజ్ కానీ.. ఇంతవరకూ ఎక్కడ స్పందించలేదు.   

Samantha7/7

దసరా రోజు గుడ్‌న్యూస్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన సమంత

త్వరలోనే సమంత, రాజ్ పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ కూడా బాగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలోనే సమంత న్యూ బిగినింగ్స్ అంటూ ఫోటోలు షేర్ చేయడంతో పెళ్లి విషయంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.