Samantha-Raj Nidimoru Marriage Ring Viral: మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లోని సమంతకు ఎంతో ఇష్టమైన భైరవి ఆలయంలో.. డిసెంబర్ 1న అత్యంత సన్నిహితుల మధ్య సామ్ మెడలో మూడుముళ్లు వేశాడు రాజ్. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సామ్ షేర్ చేయగా.. ప్రస్తుతం రాజ్ సమంతకు తొడిగిన రింగ్ మీదనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
1/5హీరోయిన్ సమంత మరోసారి పెళ్లి చేసుకుంది. సద్గురు ఈషా ఫౌండేషన్ లో అతి కొద్దీ మంది బంధు మిత్రుల సమక్షంలో రాజ్ నిడిమోరుని.. సమంత సింపుల్ గా నిరాడంబరంగా మ్యారేజ్ చేసుకొని ప్రేమను పెళ్లిగా మార్చుకుంది. వీరి పెళ్లి ఫొటోలను సామ్ షేర్ చేయగా.. నెట్టింట్లో ట్రెండింగ్ మారాయి. అయితే ఈ పిక్స్ లో సమంత పెళ్లి ఉంగరం.. తెగ వైరల్ గా మారింది.
2/5సమంతకి రాజ్ తొడిగిన ఆ పెళ్లి రింగ్.. దీర్ఘ చతురస్త్రాకారంలో డిఫరెంట్ డిజైన్ తో చాలా స్పెషల్ గా ఉంది. అయితే ఆ ఉంగరానికి ఉన్న నాలుగు మూలలకి నాలుగు అర్థాలు ఉన్నాయి.
3/5డైమండ్, పచ్చ రత్నాలతో డిజైన్ చేసిన ఈ ఉంగరంలో నాలుగు అర్థాలు ఏంటంటే.. విశ్వాసం, నిజాయితీ, ప్రేమ, వివాహంలో నిబద్ధత, బంధంలో విలువైన ప్రేమను చూపించడం.
4/5సమంతతో తన ఈ వివాహ బంధాన్ని శాశ్వతంగా నిలబెట్టుకుంటానని హామీ ఇస్తూ.. తన ప్రేమను, ప్రపంచంలోని ప్రేమను, ఆనందాన్ని తనకు ఇస్తున్నాను అంటూ రాజ్ తన ప్రేమని ఈ ఉంగరంతో ప్రత్యేకంగా వ్యక్తం చేశాడు.
5/5ఎట్టకేలకు డైరెక్టర్ రాజ్ నిడిమోరు.. సమంతను ఎంతో ప్రేమగా, సంతోషంగా తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఇలా సమంతపై తనకున్న ప్రేమను , గౌరవాన్ని రాజ్ నిడిమోరు ఈ డైమండ్ రింగ్ తో వెల్లడిస్తూ.. నేడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.