Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

Prabhas Vs Venkatesh: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే కథతో అని కాకుండా.. ఒకే లైన్ స్టోరీలతో పలు సినిమాలు తెరకెక్కడం సహజం.  ఇలా ఒకే స్టోరీతో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అందుకుంది. కానీ అదే  కథతో ప్రభాస్ మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

1 /6

Prabhas Vs Venkatesh:  అవును ఒకే స్టోరీతో  వెంకటేష్ డిజాస్టర్ అందుకున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  అందుకున్నాడు. అవును ఫిల్మ్ ఇండస్ట్రీలో  ఒకే రకమైన స్టోరీలతో మూవీలు  తెరకెక్కడం షరా మాములే.

2 /6

ఈ రూట్లోనే  వెంకటేష్ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘టూటౌన్ రౌడీ’ అనే చిత్రం. ఈ మూవీ బాలీవుడ్ లో అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తేజాబ్’ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వచ్చింది.

3 /6

కానీ టూటౌన్ రౌడీ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఫ్టాప్ గా  నిలిచింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరో లీడ్ రోల్లో  నటించడం విశేషం.

4 /6

చాలా యేళ్ల తర్వాత ప్రభాస్ ను  హీరోగా నిలిబెట్టిన చిత్రం ‘వర్షం’. త్రిష హీరోయిన్ గా శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కథ కూడా దాదాపు ‘టూ టౌన్ రౌడీ’ మూవీకి దగ్గరగా ఉంటుంది. దాదాపు 70 శాతం కథ ఒకే తరహాలో ఉంటుంది.

5 /6

వర్షం, టూ టౌన్ రౌడీ  రెండు సినిమాల మూల కథ ఒకటే అయినా.. స్క్రీన్ ప్లే మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.  అప్పట్లో వెంకటేష్.. ‘టూటౌన్ రౌడీ’ స్టోరీతో డిజాస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎన్నో యేళ్ల తర్వాత అదే కథతో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

6 /6

తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా స్టార్ డమ్ తీసుకొచ్చిన ఈ సినిమా ‘వర్షం’ చిత్రాన్ని .. ఆ తర్వాత  హిందీలో టైగర్ ఫ్రాఫ్ హీరోగా ‘బాఘీ’ టైటిల్ తో రీమేక్ చేయడం విశేషం. బాఘీ అంటే రెబల్ అని అర్ధం. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా కావడం మరో ప్రత్యేకత.