Shoaib Malik: షోయబ్ మాలిక్.. ఈ పేరు గురించి చెబితే వెంటనే గుర్తుకు రాకపోయినా, సానియా మీర్జా భర్త అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తుకొస్తుంది. సానియాతో డివొర్స్ తీసుకున్న షోయబ్.. పాక్‌కు చెందిన నటి సనా జావెద్ గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ముచ్చటగా మూడోసారి షోయబ్ విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
1/7పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అయిన షోయబ్ మాలిక్.. తన ఆటతో పాటు, టీమ్ఇండియా మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్తగా చాలా మందికి తెలుసు. సానియాతో విడాకులు తీసుకున్న తర్వాత పాక్ నటి సనా జావెద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు.
2/7షోయబ్‌కు ఇది మూడవ పెళ్లి కాగా.. సనాకు రెండో పెళ్లి. అయితే తాజాగా నెట్టింట్లో ఓ న్యూస్ ట్రెండింగ్‌గా మారింది. షోయబ్ మాలిక్.. సనా జావెద్‌కు కూడా డివొర్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడని సమాచారం.
3/72002లో షోయబ్ మాలిక్ హైదరాబాద్‌కు చెందిన అయేషా సిద్ధిఖీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 2010లో ఆమెతో విడాకులు తీసుకొని.. అదే సంవత్సరం టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు.
4/7హైదరాబాద్‌లో వీరి వెడ్డింగ్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఇక 2018లో ఈ జంటకు ఇజన్ అనే కుమారుడు జన్మించగా.. వీరు 2024లో విడిపోయారు. అయితే షోయబ్ మాలిక్ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం వల్లనే సానియా మీర్జా.. విసిగిపోయి విడాకులు తీసుకున్నట్లు, అప్పట్లో షోయబ్ సోదరి తెలిపింది.
5/7ఇక సానియా మీర్జాతో కూడా విడిపోయిన తర్వాత 2024లో షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహమై ఏడాదిన్నర కూడా కాకుండనే వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో షోయబ్, సనాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
6/7ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక దగ్గర పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరి మధ్య ఎలాంటి మాటలు చోటు చేసుకోలేదు. షోయబ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా సనా మరోవైపు ఫేస్ తిప్పుకుని కూర్చుంది. అంతేకాకుండా సనా ఫేస్‌లో అసహనం చాలా స్పష్టంగా కూడా కన్పిస్తోంది.
7/7ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. వీరిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే.. దీనిపై అటు షోయబ్ గానీ, ఇటు సనా గానీ ఇప్పటివరకూ స్పందించలేదు.