Sanju Samson Vs Shubman Gill: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేస్తున్న ప్రయోగాలతో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తనకు ఇష్టం వచ్చిన ప్లేయర్లను ఆడిస్తూ.. ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్నాడనే విమర్శ ఉంది. టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్ సెట్ అయిన సంజూ శాంసన్‌ను కాదని గిల్‌కు అవకాశాలు ఇస్తున్నాడు.
టీమిండియా యాజమాన్యం, కోచ్ గౌతమ్ గంభీర్ తీరుతో సంజూ శాంసన్ కెరీర్ సందిగ్ధంలో పడేలా ఉంది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అదరగొట్టిన సంజూను కాదని.. గిల్‌కు భారీగా అవకాశాలు కల్పిస్తున్నారు.
కొన్ని మ్యాచ్‌లు ఓపెనింగ్‌లో తప్ప ఏ స్థానంలో పడితే ఆ స్థానంలో శాంసన్‌ను ఆడించిన మేనేజ్‌మెంట్.. చివరికి తుది జట్టు నుంచి కూడా తప్పించేసింది. గిల్ కోసం సంజూ శాంసన్‌ను తొక్కేస్తున్నారని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి.. ఓపెనర్‌గా ఆడిస్తోంది. గత 13 ఇన్నింగ్స్‌ల్లో 20.23 సగటుతో 263 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. మొత్తం 34 మ్యాచ్‌ల్లో 29 సగటుతో 841 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఇప్పటికే టెస్ట్, వన్డే కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేసిన మేనేజ్‌మెంట్.. టీ20 ఫార్మాట్‌లో కూడా కెప్టెన్‌గా చేయాలని పట్టుదలతో ఉంది. అందుకే సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి గిల్‌కు భారీగా ఛాన్స్‌లు ఇస్తోంది.
టీ20 ప్రపంచ కప్ ఓపెనర్‌గా ఎంట్రీ ప్రమోషన్ పొందిన సంజూ శాంసన్.. అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. ఓపెనర్‌గా ఒకే ఏడాది మూడు సెంచరీలు బాదాడు. 14 మ్యాచ్‌ల్లో 39.38 సగటుతో 512 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 182.20గా ఉంది.
గిల్ రాకతో సంజూ శాంసన్‌ను ఇష్టమొచ్చినట్లు ఆడించిన గౌతమ్ గంభీర్.. ఇప్పుడు తుది జట్టు నుంచి కూడా పక్కనపెట్టేశాడు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 గిల్ కేవలం నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు.
దీంతో శుభ్‌మన్ గిల్‌తోపాటు గౌతమ్ గంభీర్‌ను నెటిజన్లు భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. మేనేజ్‌మెంట్ దత్తపుత్రుడు గిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైన టీమ్‌లో రాజకీయాలు ఆపి.. బాగా ఆడుతున్న ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.