Lord Shani dev Effect: శనీశ్వరుడి వల్ల కొన్నిరాశులకు అనుకొని విధంగా ధనలాభం కల్గనుంది. ముఖ్యంగా శనివారం అది కూడా శనిత్రయోదశి వేళ అరుదైన ఘటన సంభవించబోతుంది. దీని వల్ల చాలా మార్పులు సంభవిస్తాయని పండితులు చెబుతున్నారు.
శనీశ్వరుడికి త్రయోదశి తిథి అత్యంత ఇష్టమైనదిగా చెప్తుంటారు. అదే విధంగా రేపు శనివారం అది కూడా త్రయోదశితో కూడిన శనీవారం కావడంతో చాలా మంది శనీశ్వరుడ్ని ధ్యానించి..తమ ఏలినాటి, అర్దష్టమ, సాడేసాతీ దోషాల నుంచి బైటపడాలని కోరుకుంటు ఉంటారు.
అయితే.. శనీత్రయోదశి రోజున దాదాపు.. 144 ఏళ్ల తర్వాత సూర్యుడు, శని, శుక్రుడు ఒకే సరళ రేఖ మీద ఏర్పడనున్నారు. దీని ప్రభావం వల్ల మూడు రాశుల వారికి అనుకొని విధంగా జాక్ పాట్ తగిలి, జాబ్ లలో ప్రమోషన్లు పొందుతారు. ఆరాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కన్య ఈ రాశి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు దొరికే చాన్స్ స్పష్టంగా కన్పిస్తుంది . కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ వల్ల లాభాలు పొందిన వారు మీకు మేలుచేస్తారు.
మకర రాశి వీరికి ఈ యోగం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. నూతన ఇంటికి కొనుగోలు చేస్తారు. దగ్గరి బంధువలతో పెళ్లి కుదురుతుంది. మీ సోదరులతో ఏర్పడిన తగాదాలు సమసిపోతాయి.
తుల రాశి ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మీకు భార్యతరపు నుంచి ఆస్తులు లభిస్తాయి. రాజకీయ నేతలతో పరిచయాలు పెరుగుతాయి. ఏది ముట్టుకున్న అది తప్పకుండా సక్సెస్ అవుతుంది.