Saturn Transit 2025: శనివారం రాత్రి 11 గంటలకు శని గ్రహం కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారిపై విశేషమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో జీవితంలో మార్పులు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు మనం తెలుసుకున్నాం.
Saturn Transit 2025 Effect Zodiac: శని గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అతిపెద్ద గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం దాదాపు 30 ఏళ్ల తర్వాత మీనరాశిలోకి సంచారం చేయబోతోంది. శనివారం మార్చి 29వ తేదీన రాత్రి 11 గంటలకు మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సంచారం కారణంగా ప్రపంచం తో పాటు 12 రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్యుడు చెబుతున్నారు. ముఖ్యంగా శని కుంభరాశిని వదిలి మీన రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి కీడు జరిగితే.. మరికొన్ని రాశుల వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. శని మీనరాశిలో దాదాపు రెండున్నర ఏళ్ల పాటు సంచార దశలో ఉండబోతున్నాడు.
శని గ్రహం మీన(Saturn Transit Pisces 2025) రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీని ప్రభావం వల్ల ఆయా రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. శని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు ఎన్నో సమస్యలకు గురవుతారు. మరికొన్ని రాశుల వారు కర్మలను బట్టి ఫలితాలు అనుభవిస్తారు. అయితే కొన్ని రాశుల వారికి శని విశేషమైన ఫలితాలను అందించబోతున్నాడు.
శని మీన రాశిలోకి సంచారం చేయడం వల్ల మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి లభించబోతోంది. అలాగే మేషరాశి వారికి ఈ సమయంలో ఏలినాటి శని ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక మీన రాశి వారికి ఈ సమయంలో శని రెండవ దశ ప్రారంభమవుతుంది. కుంభ రాశి వారికి శని మూడవ దశ మొదలవుతుందని వారు అంటున్నారు.
సింహరాశి వారికి శని సంచారం వల్ల జీవితంలో అనేకమార్పులను ఎదుర్కొంటారు. వీరికి ఆర్థికపరమైన విషయాలపై పట్టు లభిస్తుంది. అంతేకాకుండా వారసత్వంగా వస్తున్న ఆస్తులు పరంగా కూడా మిశ్రమల అభాలు కలుగుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల హెచ్చుతగ్గులు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన విషయాలపై జాగ్రత్తలు పాటించడం ఎంతో మేలు.
మేషరాశి వారికి మీనరాశిలోకి శని గ్రహం ప్రవేశించడం వల్ల కొన్ని సమస్యలతో పాటు మిశ్రమ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఖర్చులు కూడా పెరుగుతాయి.. కాబట్టి ఆదాయ విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. అంతేకాకుండా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
ధనస్సు రాశి వారికి శని ప్రభావం వల్ల జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఇల్లు కుటుంబం సంబంధించిన అంశాల్లో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇక రియల్ ఎస్టేట్ చేసేవారికి ఈ సమయంలో అనేక మార్పులు సంభవిస్తాయి.
కుంభరాశి వారికి కూడా శని అనుగ్రహం వల్ల ఆదాయ వనరులు భారీ మొత్తంలో లభిస్తాయి. వీరికి అనుకున్న రీతిలో సమాజంలో మంచి పేరు లభిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో కాస్త ఖర్చులను అదుపులో చేసుకోవడం ఎంతో మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మీన రాశి వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆర్థికపరమైన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి..