Saturn Transit Effect: శని గ్రహం సంచారం చేసిన తర్వాత మార్చి 31న మరో సారి మీన రాశిలో కదలికలు జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Saturn Transit Effect On Zodiac 2025: శని గ్రహం సంచారం చేసినప్పుడు మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. అయితే శని సంచారం చేస్తున్న సమయంలో కొన్ని రాశులవారు లాభాలు పొందితే.. మరికొన్ని రాశులవారు నష్టపోతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మార్చి 29వ తేది వరకు శని గ్రహం కుంభ రాశిలోనే సంచార దశలో ఉంటుంది. ఆ తర్వాత కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. మార్చి 31 తేదిన మీన రాశిలో శని కదలికలు జరుపుతాడు.
శని మార్చి 31వ తేదిన మీన రాశిలో కదలికలు జరపడం వల్ల కొన్ని రాశులవారికి అంతులేని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శని అనుగ్రహం లభించి అదృష్టాన్ని కూడా పొందుతారు. అలాగే డబ్బు పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి.
శని గ్రహం వల్ల మార్చి 31వ తేది నుంచి మిథున రాశివారికి వృత్తిపరమైన జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా తల్లి, గురువు సపోర్ట్ లభించి.. జీవితంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఎలాంటి పనుల్లోనైనా ఈ సమయంలో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
మిథున రాశివారు ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. అంతేకాకుండా వ్యాపారాలు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు బహుమతులు కూడా పొందుతారు. అలాగే ఆస్తుల పరంగా కూడా అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
శని గ్రహం ప్రభావం వల్ల కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతి రంగంలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కూడా పెరిగి.. విశేషమైన లాభాలు కలుగుతాయి.
శని గ్రహం ఎఫెక్ట్ వల్ల జీవితం మొత్తం సానుకూల ప్రభావంతో ముందుకెళ్తుంది. ధైర్యంతో పాటు అదృష్టం కూడా పెరుగుతుంది. దీని వల్ల చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా విద్యార్థులు ఈ సమయంలో పోటీ పరీక్షలు రాయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
మేష రాశి శని ఎఫెక్ట్ వల్ల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడుతుంది. అలాగే విదేశీ వ్యాపారాలు చేసేవారు డబ్బులు కూడా భారీ మొత్తంలో సంపాదిస్తారు.
మేష రాశివారికి ఈ సమయంలో తండ్రితో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా కూడా ఉంటారు. అలాగే మాతపరమైన అంశాలపై ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది.