World Heaviest Person: ఒకప్పుడు 610 కిలోల బరువు..ఇప్పుడు కేవలం 68 కిలోలు. క్రేన్‌తో ఎత్తాల్సిన పరిస్థితి
2018 జనవరి నెలలో ఖాలిద్ శరీరం నుంచి ఎక్స్‌ట్రా స్కిన్ తొలగించేందుకు చివరి సర్జరీ జరిగింది. ఆ తరువాత ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు అతడిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఐదేళ్ల అనంతరం ఖాలిద్ బిన్ మొహ్సిన్ బరువు 542 కిలోలు తగ్గిపోయింది. ఇప్పుడతడు కేవలం 68 కిలోల బరువున్నాడు. ఒకప్పుడు ఇదే ఖాలిద్ 610 కిలోల బరువుండేవాడంటే ఎవరూ నమ్మలేరు కూడా.
ట్రీట్మెంట్ కోసం ఖాలిద్‌ను రియాద్‌లోని ఫహద్ మెడికల్ సిటీకు తీసుకొచ్చారు. అక్కడ ఖాలిద్ చికిత్స కొన్నేళ్లపాటు కొనసాగింది. చికిత్స ప్రారంభమైన మూడేళ్ల తరువాత ఖాలిద్ స్వయంగా ఓ వీడియో షేర్ చేశాడు. అందులో జిమ్ ఫ్రేమ్ సహాయంతో నడుస్తున్నాడు.
ఖాలిద్ బిన్ మొహ్సిన్ బరువు తగ్గేందుకు సర్జరీ, ట్రీట్మెంట్‌తో పాటు బ్యాలెన్సింగ్ డైట్ ప్రారంభించాడు. ఆ తరువాత 6 నెలల్లో అతడి బరువు సగానికి తగ్గిపోయింది. 6 నెలల్లోనే అతని బరువు 320 కిలోలకు చేరుకుంది.
బరువు కారణంగా ఖాలిద్ బిన్ మొహ్సిన్ కనీసం నడవలేకపోయేవాడు. అందుకే అతన్ని ఇంటి నుంచి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఆ తరువాత అతడి జీవితం మారిపోయింది. 2013లో ఇతని గురించి తెలుసుకున్న సౌదీ రాజు అబ్దుల్లా..రియాద్‌కు రావల్సిందిగా ఆదేశించాడు. ఎందుకంటే బరువు తగ్గేందుకు సర్జరీ చేయించడానికి. దాంతో అతడిని ఇంటి నుంచి బయటకు తీసేందుకు అమెరికా నుంచి ఓ క్రేన్ రప్పించారు.
2013లో ఈ యువకుడి వయస్సు 22 ఏళ్లు. అప్పుడితడి బరువు 610 కిలోలు. ఇతని కంటే ఎక్కువ బరువున్న వ్యక్తి అప్పట్లో జాన్ బ్రౌనర్. అతనిప్పుడు జీవించి లేడు.
ఖాలిద్ బిన్ మొహ్సిన్ 1991 ఫిబ్రవరి 28న సౌదీ అరేబియాలో జన్మించాడు.. 2013లో ఖాలిద్ ప్రపంచంలో అత్యధిక బరువున్న రెండవ వ్యక్తిగా ప్రకటితమయ్యాడు.