Add Zee Business As A Preferred Source
App

Bank Job: నిరుద్యోగులారా ఇది మీకోసమే..! పరీక్ష లేకుండానే SBI బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసేయండి..!

Written ByAruna Maharaju
Published: Sep 13, 2025, 07:07 PM IST|Updated: Sep 13, 2025, 07:07 PM IST

Sbi Bank Job: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 

 Sbi Jobs1/5

ఎస్‌బీఐలో స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీ కోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.   

Sbi Specialist Officer Notification 20252/5

ఎస్‌బీఐలో స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 2. మొత్తం 122 పోస్టులు ఉన్నాయి. వీటిలో మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) 63, మేనేజర్ (డిజిటల్ ప్లాట్‌ఫామ్స్) 34, డిప్యూటీ మేనేజర్ (డిజిటల్ ప్లాట్‌ఫామ్స్) 25 పోస్టులు ఉన్నాయి.   

Sbi Specialist Officer Notification3/5

ఎస్‌బీఐలో జాబ్స్

అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, MBA, PGDBA, PGDBM, MMS, CA, CFA, ICWA, BTech, BE లేదా MCA పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయసు 35 సంవత్సరాలు. కొన్ని వర్గాలకు నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. 

Sbi So Recruitment  4/5

ఎస్‌బీఐలో జాబ్స్

దరఖాస్తులు ఇప్పటికే సెప్టెంబర్ 11 నుంచి మొదలుకాగా.. చివరి తేది అక్టోబర్ 2 వరకు ఉంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 750 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

Sbi So Recruitment 20255/5

ఎస్‌బీఐలో ఉద్యోగాలు

అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు sbi.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.