SBI PO Recruitment 2020: ఎస్‌బీఐలో భారీగా పీఓ పోస్టులకు నోటిఫికేషన్

Mon, 30 Nov 2020-7:39 pm,

నిరుద్యోగులకు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) శుభవార్త అందించింది. ఎస్‌బీఐలో పలు ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2000 ప్రొబేషనరీ పోస్టులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది. మూడు స్థాయిలలో జరిగే పీఓ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు వెల్లడించింది. 

అభ్యర్తులు డిసెంబర్‌ 31, 2020 నాటికి గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఫైనల్ ఇయర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయనున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తగిన అర్హత, వయసు గల ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. Exam helpdesk నెంబర్ 022-22820427.

జనరల్‌-810 పోస్టులు ఉండగా, ఓబీసీ-540, ఎస్సీ-300, ఎస్టీ-150, ఈడబ్ల్యూఎస్‌-200 పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్‌ 1, 2020 నాటికి 21 -30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

మొత్తం పీఓ పోస్టులు: 2000 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్‌ 4 అధికారిక వెబ్‌సైట్: www.sbi.co.in/careers Also Read : Oppo Price Cut on Smartphones: ఆకర్షణీయమైన ధరలకే ఒప్పో స్మార్ట్‌ఫోన్లు

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులు ఈ బ్యాంక్‌లో 3 ఏళ్లు పనిచేస్తానని బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది. Also Read : SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్, పూర్తి వివరాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link