Sbi Specialist Officer Recruitment 2025: నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన తీపి కబురు అందించింది. రూ.85,920 జీతంతో ఉద్యోగాలకు దరఖాస్తు స్వీకరించబోతున్నట్లు తెలిపింది. అయితే, ఈ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Sbi Specialist Officer Recruitment 2025 In Telugu: ఎప్పటినుంచో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు గుడ్ న్యూస్ తెలిపింది. అతి త్వరలోనే ఎస్బిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా 25 సంవత్సరాలు నిండిన నిండిన వారిని నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది. అయితే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, జీతం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1/5స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్‌లో భాగంగా గరిష్ట వయస్సును 35 సంవత్సరాలుగా పేర్కొన్నారు.. రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్ లో భాగంగా తెలిపింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఐదు సంవత్సరాలు కాగా.. ఓబిసి వారికి మూడు సంవత్సరాల వయోపరమైన సడలింపు ఉండబోతున్నట్లు సమాచారం.
2/5ఇక వికలాంగులకు గరిష్టంగా 10 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా విద్యార్హతల వివరాల్లోకి వెళ్తే.. బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికెట్లు తప్పకుండా కలిగి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్యాలెన్స్ షీట్లను కూడా అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండాలి. దీంతోపాటు క్రెడిట్ పర్యవేక్షణ వంటి నైపుణ్యాలు కలిగి ఉన్న వ్యక్తులకు ఈ జాబ్ సూట్ అవుతుంది.
3/5ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం వివరాల్లోకి వెళ్తే.. ఎంపికైన స్పెషలిస్ట్ ఆఫీసర్లకు నెలకు జీతం రూ.85,920 నుంచి ప్రారంభమవుతుంది. అదనంగా బ్యాంక్ ఇతర ఇన్సెంటివ్స్ ని కూడా అందిస్తుంది. అయితే ఈ నియామకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలను నిర్వహించి.. అందులో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులను ఎంపిక చేయబోతున్నట్లు ప్రకటించింది.
4/5ఈ ఎంపికలు భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 100 మార్కుల ఇంటర్వ్యూ క్వశ్చన్‌లను అభ్యర్థులను అడగబోతోంది. స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి.. ప్రత్యేకమైన నైపుణ్యాలను నేర్పి ఉద్యోగాల్లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అంశాలను త్వరలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
5/5ఇక ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవాలనుకునేవారు.. నేరుగా SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కాబట్టి మీరు కూడా ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా.. అధికారిక వెబ్సైట్‌ను సందర్శించి.. అందులో వ్యక్తిగత వివరాలను నమోదుచేసి, కొన్ని సర్టిఫికెట్స్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.