Add Zee Business As A Preferred Source
App

Tomorrow Holiday: స్కూళ్ల సెలవులు పొడిగింపు.. ఎప్పుడు? ఎన్ని?

Published: Oct 27, 2025, 10:42 PM IST|Updated: Oct 27, 2025, 10:42 PM IST

School Holiday Extends Another Two Days In Nellore And Chittoor: విద్యార్థులకు భారీ అలర్ట్‌. మళ్లీ పాఠశాలల సెలవులు పొడిగించారు. ఇప్పటివరకు వచ్చిన సెలవులు కాకుండా మరిన్ని సెలవులు వచ్చాయి. మొంథా తుఫాన్‌ ప్రభావం కారణంగా ఏపీ వ్యాప్తంగా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1/6

భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలోనే వర్షాలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.

2/6

ఇప్పటికే కొన్ని జిల్లాలకు సెలవులు ప్రకటించగా తాజాగా మరికొన్ని జిల్లాలకు ఏపీ ప్రభుత్వం సెలవు ఇచ్చింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.

3/6

మొంథా తుఫాన్‌ తీరం దాటుతుండడంతో భారీ నుంచి అతి భారీ నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇంకొన్ని జిల్లాలకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

4/6

కాకినాడలో ఈనెల 31వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాల నేపథ్యంలో అక్కడ సెలవులు కొనసాగుతున్నాయి.

5/6

విశాఖపట్టణం, వైఎస్సార్‌ కడప, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్డీఆర్‌, గుంటూరు, అల్లూరి, విజయనగరం, మన్యం, అనకాపల్లి, బాపట్ల, అల్లూరి జిల్లాలో మూడు రోజులు సెలవులు ఇచ్చారు.

6/6

ఏపీ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. కానీ కర్నూలు, అనంతపురం జిల్లాలకు మాత్రం ఎలాంటి సెలవు లేదు.