School Holiday
అక్టోబర్ నెలలో పండుగల సీజన్ మొదలవడంతో.. దేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లు సెలవులు ప్రకటించాయి. అక్టోబర్ 15, 2025 (బుధవారం) నాడు కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి. మహారాజా అగ్రసేన్ జయంతి.. దీపావళి.. ఛఠ్ పూజా ఏర్పాట్ల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు పనిచేయవు.
వరస సెలవులు తర్వాత మళ్లీ ఈరోజు కూడా స్కూల్ పిల్లలకు సెలవు రానుంది. కొన్ని రాష్ట్రాలలో ఈరోజు అక్టోబర్ 15న సెలవు ప్రకటించారు ప్రభుత్వం.
హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ఈ కారణంగా ప్రభుత్వ..ప్రైవేట్ స్కూళ్లు కూడా మూసివేయబడ్డాయి. అంతేకాకుండా..కొన్ని జిల్లాల్లో పండుగ ఏర్పాట్ల కారణంగా స్థానిక సెలవులు కూడా ఇవ్వబడ్డాయి.
కర్ణాటక రాష్ట్రంలో 18 అక్టోబర్ వరకు రాష్ట్రవ్యాప్త పరిపాలనా కారణాలతో స్కూళ్లు మూసివేశారు. బీహార్ లో దీపావళి.. ఛఠ్ పూజా ఏర్పాట్ల కారణంగా పలు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి.
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం అక్టోబర్ 15న సెలవు లేదు. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లు, కళాశాలలు సాధారణంగా కొనసాగుతాయి. అయితే దీపావళి వారంలో..అంటే అక్టోబర్ 18 నుండి 23 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
దీపావళి తరువాత కూడా భాయ్ దూజ్ సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు ఒకటి లేదా రెండు రోజులు అదనంగా మూసివేయబడతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు లేదా జిల్లా విద్యాశాఖ అధికారిక ప్రకటనలను చెక్ చేసుకోవాలని సూచించారు.