School Holiday 2025: విద్యార్థులకు ఎగిరి గెంతేసే వార్త. భారీ వర్షాల కారణంగా నేడు అనగా అక్టోబర్ 16న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వానలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్కూళ్లకు సెలవులు మంజూరు చేశారు.
1/5స్టూడెంట్స్‌కి బంపర్ గుడ్‌న్యూస్. మరో రెండు రోజుల్లో దీపావళి సెలవులు రాబోతున్నాయి. కానీ అంతకముందే భారీ వర్షాల కారణంగా.. తమిళనాడు రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
2/5తమిళనాడు రాష్ట్రంలోని నెల్లై , తూత్తుకుడి మరియు తెన్కాశి జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
3/5తమిళనాడు తీరప్రాంతం మరియు కుమారికడల్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ ఉపరితల ఆవర్తనం కారణంగా.. రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
4/5దీంతో తమిళనాడు రాష్ట్రంలోని మూడు జిల్లాలైన నెల్లై, తూత్తుకుడి మరియు తెన్కాశిలో.. భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.
5/5మరో రెండు రోజుల్లో సెలవులు రాబోతున్న క్రమంలో.. ఈలోపే మళ్లీ స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు సంబరపడిపోతున్నారు.