Schools Holiday: ఆగస్టు నెలలో సెలవులు వెల్లువై వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలో కూడా.. వర్షాల కారణంగా అలానే కొన్ని పండుగల..కారణంగా వరుస సెలవులు వచ్చాయి . ఈ క్రమంలో రేపు సెప్టెంబర్ 18వ తేదీన కూడా కొన్ని రాష్ట్రాలలో సెలవు ఉందనుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
1/52025 సెప్టెంబర్ 18, గురువారం నాడు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించబడ్డాయి ఒకవైపు భారీ వర్షాలు, వరదల వంటి పరిస్థితులు, మరొకవైపు ప్రాంతీయ పండుగలు ముందడం వలన.. గురువారం కొన్ని రాష్ట్రాలలో సెలవులు ప్రకటించారు.
2/5మణిపూర్ రాష్ట్రం వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది. వర్షాలు కొనసాగుతుండటంతో ఇంఫాల్ వ్యాలీ సహా పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు.. విశ్వవిద్యాలయాలు మూసివేయాలని నిర్ణయించారు. వాతావరణ శాఖ వచ్చే రెండు రోజులు కూడా వర్షాలు కొనసాగే అవకాశముందని హెచ్చరించింది.
3/5ఉత్తరాఖండ్‌లో వరుసగా మేఘ విస్ఫోటాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా పాఠశాలలు మూతపడ్డాయి. సెప్టెంబర్ 18న కూడా విద్యాసంస్థలు మూసివేసే అవకాశముంది. వాతావరణ శాఖ రాష్ట్రానికి ‘యెల్లో అలర్ట్’ ప్రకటించింది.
4/5మహారాష్ట్రలో ఔరంగాబాద్, జల్నా, నాగపూర్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్షాలు, మెరుపులు ఉంటాయని హెచ్చరిక జారీ చేసింది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించలేదు. తల్లిదండ్రులు అధికారిక ప్రకటనలు గమనించాలని సూచించారు.
5/5హర్యానా, పంజాబ్‌లో స్థానిక పండుగల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు రేపు మూసివేయబడునున్నాయి. రాజస్థాన్‌లో సెప్టెంబర్ 22న నవరాత్రి ఏర్పాట్లకు సంబంధించి.స కొన్ని పాఠశాలలకు సెలవు ఉండే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో దుర్గాపూజా ఏర్పాట్ల దృష్ట్యా కొన్ని పాఠశాలలు మూసివేయబడతాయి.