Add Zee Business As A Preferred Source
App

School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. రేపు స్కూళ్లకు సెలవు..!

Written ByAruna Maharaju
Published: Sep 22, 2025, 05:15 PM IST|Updated: Sep 22, 2025, 05:22 PM IST

School Holiday Tomorrow: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. రేపు అనగా సెప్టెంబర్ 23న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మొత్తం సూళ్లకు సెలవు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర చివరి పాలకుడు మహారాజా హరి సింగ్ జీ జయంతి సందర్భంగా.. పాఠశాలలకు ఈ సెలవును ప్రకటించారు. 
 

 School Holiday Tomorrow1/5

పాఠశాలలకు సెలవు

జమ్మూ కాశ్మీర్‌లో మహారాజా హరి సింగ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 23న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సెలవును ప్రకటించింది. 

 School Holiday 2/5

స్కూళ్లకు సెలవు

నార్మల్‌గానే విద్యార్థులు స్కూల్‌కి ఎప్పుడెప్పుడూ డుమ్మ కొడదమా అంటూ ఎదురు చూస్తుంటారు. ఇక ప్రభుత్వమే హాలీడే ప్రకటించడంతో విద్యార్థులు ఆనందంలో తేలిపోతున్నారు.   

 Holiday Tomorrow3/5

మహారాజా హరి సింగ్ జమ్మూ కాశ్మీర్ చరిత్రలో కీలక పాత్ర పోషించారు. ఆయన పాలనలోనే జమ్మూ కాశ్మీర్ భారత్‌లో విలీనమైంది.  విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో చేసిన సంస్కరణలతో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు.

 Schools Holidays 4/5

రేపు స్కూళ్లకు సెలవు

ప్రతి సంవత్సరం ఆయన జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంలో పాఠశాలలు, కళాశాలలు మూసివేయడం ద్వారా విద్యార్థులు కూడా మహారాజా చేసిన సేవలను స్మరించుకునే అవకాశం లభిస్తుంది.  

 School Holiday Tomorrow5/5

స్కూళ్లకు హాలీడే

మహారాజా విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన కారణంగా.. నేటి తరానికి ఆయన ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు.