Add Zee Business As A Preferred Source
App

School Holiday 2025: విద్యార్థులకు పండగే.. దీపావళికి రెండు కాదు ఏకంగా మూడు రోజులు సెలవులు

Written ByAruna Maharaju
Published: Oct 16, 2025, 01:59 PM IST|Updated: Oct 16, 2025, 04:22 PM IST

School Holidays Today:  తెలంగాణ విద్యార్థులకు వరుస సెలవులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌లో దసరా సెలవులతో ప్రారంభమైన ఈ హాలిడేస్ ప్రవాహం.. ఈ నెలలో దీపావళి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్టోబర్‌లో దసరాతో పాటు రెండో శనివారం, ఆదివారాలతో కలిపి వరుస సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో  అక్టోబర్ 18న కూడా స్కూళ్లకు, కాలేజీలకు కూడా సెలవు రాబోతుంది. 
 

Telangana Bandh School College Holdays1/5

దీపావళికి మూడు రోజుల సెలవులు

స్కూల్, కాలేజ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఈ వారంలో వరుసగా మూడు రోజులు సెలవులు రాబోతున్నాయి. మరి ఏ రోజు ఎందుకు సెలవుందో ఇక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం.

School Holidays 3 Days Diwali Break2/5

స్కూళ్లు బంద్

ఈ దీపావళికి ఇటు తెలంగాణ, అటు ఏపీలో కేవలం ఒకేరోజు అధికారిక సెలవుంది. కానీ ఆదివారం కూడా కలిసి రావడంతో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు మరో సెలవు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో దీపావళి హాలిడేస్ మూడు రోజులకు పెరిగేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Telangana Bandh Holiday3/5

పాఠశాలలకు సెలవు

అక్టోబర్ 18న తెలంగాణలో విద్యాసంస్థలు, ఆఫీసులు నడిచే అవకాశాలు కనిపించడంలేదు. ఎందుకంటే తెలంగాణలో బిసి రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీంతో ఉద్యమానికి సిద్దం అవుతున్న బిసి సంఘాలు అక్టోబర్ 18న, శనివారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. 

School Holiday 20254/5

స్కూళ్లకు సెలవు

ఇప్పటికే ఈ బంద్‌కు బీఆర్ఎస్, బీజేపీ సంపూర్ణ మద్దతును తెలిపాయి. దీంతో కొన్ని విద్యాసంస్థలు బంద్ నేపథ్యంలో అక్టోబర్ 18న ముందుగానే సెలవు ప్రకటించే ఛాన్సులు ఉన్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు హాలిడే ఇవ్వకుండా ఓపెన్ చేసినా.. బిసి విద్యార్థి సంఘాలు, బంద్‌కు మద్దతిచ్చే రాజకీయ పక్షాలు మూసివేయించే అవకాశాలున్నాయి. 

Telangana School Holidays5/5

స్కూళ్లకు సెలవు

ఒకవేళ బంద్ కొనసాగితే స్కూళ్లు, కాలేజీలకు.. శనివారం, ఆదివారంతో పాటు సోమవారం కలిపి మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి.