School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..12 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు..డిసెంబరు 24 - జనవరి 5 నాన్‌స్టాప్‌గా!

Half Yearly School Holidays: స్కూల్ విద్యార్థులకు శుభవార్త. పాఠశాలల్లో హాఫ్ ఇయర్లీ పరీక్షలు పూర్తవ్వగానే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. అయితే ముందుగా 8 రోజులు అనుకున్న సెలవులను మరో 4 రోజులు పొడిగించి 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే ఎక్కడో తెలుసా?

1 /7

హాఫ్ ఇయర్లీ పరీక్షలు పూర్తవ్వగానే తొలుత 8 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు వాటిని మరో 4 రోజులు పెంచుతున్నట్లు సమాచారం. దీంతో మొత్తంగా 12 రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. 

2 /7

తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2025-26 అకడమిక్ ఇయర్ నడుస్తోంది. ఇటీవలే త్రైమాసిక పరీక్షలు పూర్తవ్వగా.. డిసెంబరులో అర్ధవార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలు పూర్తవ్వగానే తమిళనాడులో క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్బంగా సెలవులు ఇవ్వనున్నారు. 10వ తరగతి విద్యార్థులకు డిసెంబరు 10న హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరగనున్నాయి.

3 /7

అలాగే 6 నుంచి 9 తరగతుల స్టూడెంట్స్ కు మాత్రం డిసెంబరు 15 నుంచి.. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 15 నుంచి 23 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే అన్నీ తరగతుల పరీక్షలు డిసెంబర్ 23 కే ముగుస్తాయి. 

4 /7

ఈ విధంగా.. హాఫ్ ఇయర్ పరీక్షలు డిసెంబరు 23 వరకు జరుగుతాయి. దీని తర్వాత డిసెంబరు 24 నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సెలవులు ఇవ్వనున్నారు. దీంతో డిసెంబరు 24 నుంచి తొలుత 8 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. 

5 /7

డిసెంబర్ 25న క్రిస్మస్..అలాగే జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా సెలవులు ఇవ్వనున్నారు. డిసెంబరు 2న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది.

6 /7

అయితే పాఠశాల విద్యా శాఖ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 2వ తేదీని సెలవు దినంగా పేర్కొన్నారు. కాబట్టి, ఆ రోజు సెలవు కావచ్చు. ఆ తర్వాత, జనవరి 3, 4వ తేదీలు శని, ఆదివారాల్లో వస్తాయి. అందువల్ల, అర్ధసంవత్సర సెలవుల తర్వాత జనవరి 5వ తేదీన పాఠశాలలు తిరిగి రీఓపెన్ అవుతాయని సమాచారం. 

7 /7

అంటే డిసెంబర్ 24 నుండి జనవరి 4 వరకు అనగా వరుసగా 12 రోజుల హాఫ్ ఇయర్లీ సెలవులు రావొచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన విద్యాశాఖ త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.