School Holidays: విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. వరుసగా రేపటి నుంచి స్కూళ్లకు మూడు రోజులు సెలవులు..

School Holidays: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలు స్కూల్లకు కాలేజీలకు రేపు, ఎల్లుండి సెలవు ప్రకటించాయి. ఆదివారం ఎలాగో సెలవు కాబట్టి.. వరుసగా మూడు సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు ఎగిరి గంతేస్తున్నారు. 

1 /6

School Holidays: గత వారం స్కూళ్లు అఫీషియల్ గా మొదలైన.. ఈ సోమావారం నుంచే పిల్లలు స్కూల్లకు కాలేజీలకు వెళుతున్నారు. పాఠశాలలకు వెళుతున్న తొలి వారంలోనే విద్యార్ధులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్నంలో స్వయంగా పాల్గొని ఆసనాలు వేయనున్నారు. 

2 /6

యోగా ఏర్పాట్లలో భాగంగా ముందు రోజు శుక్రవారం 20వ తేదిని విశాఖపట్నంలోని అన్ని స్కూల్లకు సెలవులు ప్రకటించింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా సెలవులను మంజూరు చేశారు. అటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో శుక్రవారం అంతర్జాతీయ యోగాదినోత్సవ ఏర్పాట్లలో భాగంగా కొన్ని స్కూళ్లు, కాలేజీలు సెలవులు ప్రకటించాయి. 

3 /6

ముఖ్యంగా ఈ నెల 20, 21వ తేదీల్లో సెలవులు ఇస్తున్నట్లు డీఈవో  తెలిపారు. అటు ఆదివారం ఎలాగో సెలవు రోజు కాబట్టి విద్యార్ధులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇక శుక్రవారం,శని వారం రోజుల్లో ప్రతి స్కూల్లో విద్యార్థులకు యోగాసనాలపై శిక్షణ ఇవ్వనున్నారు.  అన్ని ప్రైవేట్, గవర్నమెంట్ స్కూళ్లో విధిగా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు.

4 /6

విశాఖలో యోగా డే వేడుకలకు ప్రభుత్వం  భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం బీచ్ రోడ్డులోని ప్రధాన వేదిక నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే విశాఖలోనే మంత్రుల బృందం ఈ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. అటు ఈ రోజు సాయంత్రం లోకేష్ విశాఖకు వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్నారు. రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించబోతున్నారు.   

5 /6

అటు విశాఖ పట్నంలోని ఏయూలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో  25 వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్యనమస్కారాలు చేయనున్నారు. అటు విశాఖ తీరంలో ఈ నెల 20,21 తేదిల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు చేపలవేటపై రెండు రోజుల పాటు నిషేధం కొనసాగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. 

6 /6

యోగా డే కు వర్షం ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. ఉదయం నుంచి చినుకులు పట్టడంతో యోగాడేకి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న ఏపీ ప్రభుత్వం. భారీగా వీస్తున్న ఈదురు గాలులు తట్టుకొని నిలబడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.