School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. మిలాద్ ఉన్ నబీ, వినాయక నిమజ్జనం, ఆదివారం కావడంతో వరుసగా సెలవులు వస్తున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన జరుగుతుంది. దీంతో ఆరోజు హైదరాబాద్ లో సెలవు దినం రానుంది.
1/6తెలంగాణలోని విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవుల మీద సెలవులు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు వస్తున్నాయి.
2/6సెప్టెంబర్ 5న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా, సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ సహా హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం కారణంగా మరొక సెలవు వస్తోంది. సెప్టెంబర్ 7 ఆదివారం కావడంతో మూడు రోజుల పాటు విద్యార్థులు, ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ వస్తోంది.
3/6ఈ వరుస సెలవులు కేవలం విద్యార్థులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ రంగంలో పనిచేసే వారికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. మూడు రోజుల సెలవులు రావడం వల్ల చాలామంది పర్యాటక యాత్రలకు వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
4/6నగర జీవితానికి దూరంగా ప్రక్రుతి ఒడిలో సేదతీరాలని చాలా మంది కోరుకుంటారు. అయితే వర్షాలు కూడా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉండటం వల్ల మూడు రోజుల పాటు ఎక్కడైనా ట్రిప్ కు వెళ్లాలని ప్లాన్ వేస్తున్నారు.
5/6ఈ సెలవులను సద్వినియోగం చేసుకుని కుటుంబంతో లేదా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడపాలని చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఆ విధంగా హాలుడే ప్లానింగ్ చేసుకునేవారికి తెలంగాణలోని కొన్ని పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం మంచిదని చెప్పవచ్చు. ఈ
6/6ఈ సెలవు దినాలు ఎక్కువ మందికి అనుకూలంగా ఉండటం వల్ల పర్యాటక ప్రదేశాల్లో రద్దీఎక్కుగా ఉంటాయి. ప్రయాణానికి ముందుగానే టికెట్లు, వసతి బుక్ చేసుకోవడం బెటర్.