Add Zee Business As A Preferred Source
App

School Holidays: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. రేపు స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!!

Written ByBhoomi
Published: Sep 09, 2025, 06:38 PM IST|Updated: Sep 09, 2025, 06:38 PM IST

School Holidays  Tomorrow:  విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపు సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఎక్కడ, ఏయే జిల్లాల్లో పాఠశాలలకు సెలువు ప్రకటించారు.. ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం. 

School Holidays  Tomorrow 1/6

“సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ”

అనంతపురం పట్టణంలో రేపు జరగబోయే “సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ” కు సంబంధించి ఒక ముఖ్య నిర్ణయం వెలువడింది. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. పెద్ద ఎత్తున జనసందోహం ఉండే అవకాశం ఉండటంతో, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

 Anantapur2/6

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు రేపు సెలవు

ఈ క్రమంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటించారు. సభ కారణంగా పట్టణంలో రద్దీ పెరగనుందని, విద్యార్థుల రవాణా సౌకర్యం దెబ్బతినే అవకాశముందని అధికారులు అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేపటికి విద్యాసంస్థలు మూసిఉండనున్నాయి. 

ChandrababuNaidu3/6

విద్యార్థుల పాఠశాల రోజుల సంఖ్య

అయితే విద్యార్థుల పాఠశాల రోజుల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు మరో చర్య కూడా తీసుకున్నారు. రేపు హాలీడే ఇచ్చినందున బదులుగా, ఈ నెల 13వ తేదీ, అంటే రెండవ శనివారం, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పనిచేయనున్నాయి. సాధారణంగా రెండవ శనివారం సెలవు ఉండే ఆచారాన్ని ఈసారి మార్చారు.

 PawanKalyan4/6

విద్యార్థులకు ఇబ్బందులు

ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్య తీసుకుంది ప్రభుత్వం. మరోవైపు సభకు సంబంధించి అధికారులు భద్రతా ఏర్పాట్లు కూడా  చేస్తున్నారు.

Super6SuccessMeet5/6

 ట్రాఫిక్ నియంత్రణ చర్యలు

 ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతూ, పట్టణంలోని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల భద్రతతో పాటు, పట్టణ రవాణా వ్యవస్థ సజావుగా నడిచేలా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల తల్లిదండ్రులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

AndhraPradeshNews6/6

సూపర్ 6 విజయోత్సవ సభ

మొత్తంగా అనంతపురంలో రేపు జరిగే సూపర్ 6 విజయోత్సవ సభ కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం ఒక జాగ్రత్త చర్యగా అధికారులు చెబుతున్నారు. ఒకవైపు సభ విజయవంతంగా సాగడానికి, మరోవైపు విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా చూసే ప్రయత్నం చేస్తూ 13వ తేదీన పాఠశాలలు పనిచేయనున్నాయి.