Add Zee Business As A Preferred Source
App

School Holidays: ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు.. టీచర్లకు విద్యాశాఖ కీలక సూచనలు..

Written ByRenuka Godugu
Published: Apr 22, 2025, 08:16 AM IST|Updated: Apr 22, 2025, 08:16 AM IST

Big Alert To Teachers on School Holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి ఎండాకాలం సెలవులు ప్రారంభమవుతాయి. మళ్లీ జూన్ 12వ తేదీ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే టీచర్లకు విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. 
 

Summer Holidays1/5

సమ్మర్ హాలిడేస్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ 24 నుంచి స్కూల్ సమ్మర్ హాలిడేస్ మొదలుకానున్నాయి. అంటే 23వ తేదీ చివరి వర్కింగ్ డే జూన్‌ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు టీచర్లకు విద్యాశాఖ కీలక సూచనలు చేసింది.  

Telangana Holidays2/5

తెలంగాణ సెలవులు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిప్యుటేషన్ల పై పనిచేస్తున్న టీచర్లు ఇవ్వాళ రిలీవై రేపు పాత స్కూల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు తెలంగాణలోనూ ఎల్లుండి ఉంచే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి.  

Summer3/5

ఎండాకాలం

ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎండాకాలం సెలవుల్లో కూడా పిల్లలకు తరగతులు నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల కూడా విద్యాశాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో నడుస్తున్నాయి.   

AP4/5

ఆంధ్రప్రదేశ్‌

 ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నడుస్తాయి. ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎండాకాలం సెలవులు మాత్రమే కాదు.. ఏప్రిల్ లో కొన్ని స్కూల్ హాలిడేస్ కూడా వచ్చాయి.   

Telangana5/5

తెలంగాణ

 అయితే నేడు తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు.