Add Zee Business As A Preferred Source
App

School Holiday Today: ఈరోజు.. అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణమేమిటంటే..?

Written ByVishnupriya
Published: Sep 17, 2025, 07:27 AM IST|Updated: Sep 17, 2025, 07:27 AM IST

Schools Holiday: గత వారమే.. రెండో శనివారం, ఆదివారం సెలవు రాగా.. ఇప్పుడు మళ్లీ బుధవారం అనగా సెప్టెంబర్ 17వ తేదీన కూడా ఎన్నో రాష్ట్రాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాకుండా ఈ బుధవారం సెలవు రావడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇంతకీ కారణాలు ఏమిటి‌. ఎక్కడ ఎక్కడ పాఠశాలకు సెలవు అనే విషయానికి వెళితే…

School Holiday on September 17:1/5

విశ్వకర్మ పూజ స్కూల్ హాలిడే,

2025 సెప్టెంబర్ 17 (బుధవారం)న దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవకు ప్రధాన కారణం విశ్వకర్మ పూజతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతూ ఉండడం . ఈ సందర్భంగా యూపీ, బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలు.. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేయబడనున్నాయి.

School Holiday 2/5

యూపీ స్కూల్ సెలవులు

విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం కన్యా సంక్రాంతి రోజున జరుపుకుంటారు. 2025లో అది సెప్టెంబర్ 17న.. వస్తోంది. శిల్పకారుల దేవుడిగా భావించే విశ్వకర్మను ఆరాధించడం ఈ పండుగలో ప్రధాన విశేషం. విద్యార్థులు, ఇంజినీర్లు, టెక్నికల్ రంగానికి చెందినవారికి సైతం..ఈ రోజు ఎంతో ప్రాముఖ్యం.. కలిగివుంటుంది. సాధనాలు, పరికరాలు, వర్క్‌షాప్‌లను పూజించి పని సాఫీగా సాగాలని ప్రార్థిస్తారు.

North States Holiday 3/5

బెంగాల్ స్కూల్ హాలిడే

ఉత్తరప్రదేశ్: ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. బ్యాంకులు, పాఠశాలలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయి. అలానే బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం, ఝార్ఖండ్, త్రిపురా.. లాంటి ప్రదేశాలలో.. విశ్వకర్మ పూజ చాలా ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని ఏరియాల్లో కూడా..పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగ స్థలాలు దాదాపు అన్నీ మూసివేయబడతాయి.  

Holiday List4/5

స్కూళ్లు సెలవు

మహారాష్ట్ర: ముంబై, పూణే వంటి నగరాల్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే సెలవు ఇవ్వనున్నాయి.  తెలంగాణ: హైదరాబాద్, పరిశ్రమల ప్రాంతాల్లోని కొన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు, స్కూళ్లు సెలవు ఉండొచ్చు.  

School Holiday 5/5

సెప్టెంబర్

సెప్టెంబర్ నెలలోనే ఇప్పటికే ఓణం, ఈద్-ఏ-మిలాద్ వంటి పండుగల కారణంగా పలు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశ్వకర్మ పూజ సందర్భంగా మరో సెలవు రావడం విద్యార్థులకు ఆనందాన్ని కలిగిస్తోంది.