School Holiday Tomorrow
సెప్టెంబర్ 4, 2025న దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు ఏ వల్ల.. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రవాణా సమస్యలు తలెత్తడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
1/5పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ-ఎన్సీఆర్, జమ్మూ-కాశ్మీర్, గాజియాబాద్, నోయిడా, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉండటంతో.. పాఠశాలలు మూసివేశారు. ఇంక ఈ సెలవులను సెప్టెంబర్ 4న కూడా కొనసాగించాలని తెలిపింది ప్రభుత్వం.
2/5హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెప్టెంబర్ 7 వరకు సెలవు ప్రకటించారు. వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్లో వరదలు విస్తృతంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సెప్టెంబర్ 7 వరకు మూసివేయబడ్డాయి.
3/5జమ్మూ కాశ్మీర్లో..ప్రతికూల వాతావరణం కారణంగా సెప్టెంబర్ 4న అన్ని విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి. అలానే ఢిల్లీలో కూడా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా.. నగర జీవనం స్థంభించిపోయింది. సెప్టెంబర్ 4న పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉన్నా.. అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.
4/5కేరళలో ఓనం.. సందర్భంలో సెప్టెంబర్ 7 వరకు పాఠశాలలకు సెలవు ఉండగా, క్లాసులు సెప్టెంబర్ 8న పునఃప్రారంభమవుతాయి.
5/5ఆంధ్రప్రదేశ్ లో సైతం.. కొన్ని జిల్లాల్లో వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ, సెప్టెంబర్ 4న సెలవు ప్రకటించలేదని అధికారులు తెలిపారు. స్థానిక ప్రకటనలను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.