Schools Holiday : ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాను వల్ల.. ఇప్పటికే సోమవారం చాలా దగ్గరలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఈ సెలవులు మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు కొనసాగనున్నాయి. కొన్ని జిల్లాల్లో మూడు రోజులు మాత్రమే సెలవు ఉందిగా మరికొన్ని జిల్లాల్లో ఐదు రోజులు సెలవులు ఉన్నాయి.. మరి ఎక్కడెక్కడ ఎన్ని రోజులు సెలవు అనే వివరాలకు వెళ్ళిపోయి..
1/6ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా.. ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాల్లో.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ముఖ్యంగా కోస్తా ప్రాంతాలపై ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
2/6మొంథా తుపాను బంగాళాఖాతంలో.. ఏర్పడి మరింత బలపడి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి సమయానికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా. ఈదురు గాలులు గంటకు 100 కిలోమీటర్ల… వరకు వీచే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అతి జాగ్రత్తలు తీసుకుంటోంది. తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేయడం వల్ల అన్ని డిపార్ట్‌మెంట్‌లు హెచ్చరిక స్థాయిలో పనిచేస్తున్నాయి.
3/6ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కాకినాడ జిల్లాలో.. అత్యధికంగా ఐదు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలంలో విద్యార్థులు ఇంటి వద్ద సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు.
4/6గుంటూరు, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి జిల్లాల్లో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 27, 28, 29 తేదీలు మాత్రమే సెలవులుగా నిర్ణయించారు. కడప, అన్నమయ్య, ఏలూరు, తూర్పు గోదావరి..అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్టోబర్ 27, 28 తేదీల్లో రెండు రోజుల సెలవులు ప్రకటించారు. పల్నాడు జిల్లాలో మాత్రం అక్టోబర్ 27 తేదీకి మాత్రమే సెలవు ప్రకటించారు.
5/6తుపాను పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైతే సెలవులను పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనా వేసిన ప్రకారం ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కడప, తిరుపతి.. నంద్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ప్రమాదం ఉండటం వల్ల ప్రజలు బయట.. అవసరం లేకుండా తిరగకూడదని అధికారులు సూచిస్తున్నారు.
6/6విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో కూడా రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. విద్యార్థులూ, తల్లిదండ్రులూ ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.