Schools Will Remain Closed For 10 Days In October: సెప్టెంబర్ నెల ముగిసి అక్టోబర్‌లోకి అడుగుపెట్టాం. చూస్తుండగానే 2025 సంవత్సరం వెళ్లిపోతుంది. అక్టోబర్‌లోకి అడుగుపెట్టడంతో మరి స్కూల్స్, కాలేజ్‌లకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం. ఒక అవగాహన కోసం తెలుసుకోవాలి.
1/6ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. వరుసగా దాదాపు వారం రోజులు సెలవులు పొందారు. పండుగలు, ప్రత్యేక ఉత్సవాలు, స్థానిక పరిస్థితుల కారణంగా దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు మూకుమ్మడి సెలవులు వచ్చాయి. మరి అక్టోబర్‌లో ఎన్ని వచ్చాయో తెలుసుకుందాం.
2/6దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో పాఠశాలలకు సెలవులు ఆదివారాలు మినహాయిస్తే 6 సెలవులు వచ్చాయి. ఆదివారాలను కలిపితే 10 రోజులు సెలవులుగా పరిగణించాలి. దసరా, దీపావళి ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగా సెలవులు పెరిగే అవకాశం ఉంది.
3/6అక్టోబర్ నెలలో పరిశీలిస్తే 1 మహానవమి, 2 గాంధీ జయంతి, దసరా, 7 మహర్షి వాల్మికీ జయంతి, 18 దంతెరాస్, 20 దీపావళి, 22 గోవర్ధన్ పూజ, 28 చాత్‌ట్ పూజ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఉన్నాయి.
4/6అవి కాకుండా మరికొన్ని స్థానిక సంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాల సందర్భంగా అక్టోబర్‌లో పాఠశాలలకు ప్రత్యేక సెలవులు ఉండవచ్చు. ఆ సెలవులపై స్థానిక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి.
5/6ఇప్పటికే బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రులు, దసరా పండుగ సందర్భంగా తెలంగాణ, ఏపీలో స్కూల్స్, కాలేజీలకు భారీగా సెలవులు వచ్చాయి. అక్టోబర్ 6వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. దీపావళికి కూడా రెండు రోజులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
6/6ఇక వర్షాకాలం కావడంతో పలుచోట్ల భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా అప్పటికప్పుడు సెలవులపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు వస్తుంటాయి. అక్టోబర్‌లో కూడా వర్షాల కారణంగా సెలవులు వచ్చే అవకాశం ఉంది.