Schools Closed Today
పిల్లలకు వరుసగా దసరా సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 12 రోజుల సెలవు తర్వాత మళ్లీ.. అక్టోబర్ 3 అనగా శుక్రవారం స్కూల్లు తెరుచుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న కారణంగా.. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు…
1/5దాదాపు 12 రోజుల సెలవులు తర్వాత మళ్లీ శుక్రవారం అనగా అక్టోబర్ మూడవ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని స్కూళ్ళు తెరుచుకున్నాయి. శుక్రవారం, శనివారం సెలవు కూడా ఇచ్చి సోమవారం నుంచి స్కూల్లు తెరవాలని కొంతమంది పేరెంట్స్ అభ్యర్థన చేశారు.
2/5ప్రభుత్వం.. ఇప్పటికే విద్యార్థులకు ఎక్కువ సెలవులు రావడంతో.. తల్లిదండ్రుల అభ్యర్థన పట్టించుకోకుండా శుక్రవారం నుంచి స్కూల్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు రానుంది..
3/5ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.. ఉత్తరాంధ్రలోని.. శ్రీకాకుళం.. లాంటి ప్రాంతాలలో అలానే.. నెల్లూరు, తిరుపతి లాంటి ప్రదేశాలలో భారీ వర్షాలు పడుతున్నాయి.
4/5ఈ వర్షాల వల్ల.. ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో ప్రాంతాలు అతలాకుతలం అయిపోయాయి. ఈ నేపథ్యంలో పలు స్కూల్స్ కి.. సెలవులు ప్రకటించారు. కొన్ని స్కూల్స్.. తమ బస్ ట్రాన్స్పోర్ట్.. అందించలేము అంటూ మెసేజ్లు కూడా పెట్టారు.
5/5ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా.. ఆ చోట్లను బట్టి.. ఆ స్కూల్ యజమాన్యాలు ఈ సెలవు నిర్ణయం తీసుకున్నాయి.