Scrub typhus fever: తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. నల్లి అనే చిన్న కీటకం కుట్టినప్పుడు ఈ ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. ఈ పురుగు మనకు తెలియకుండానే కుట్టి.. జారిపోతుంది. మొదట్లో ఇది ఒక చిన్న మచ్చలా కనిపిస్తుంది. కానీ సకాలంలో గుర్తించకపోతే సమస్యలు తీవ్రమవుతాయి.
1/6స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?
ఈ వ్యాధి ఒరియంటియా సూసుగముషి అనే బాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ప్రధానంగా పొదలు..పచ్చిక బయళ్లలో ఉండే నల్లుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. వైద్యుల ప్రకారం..ఈ ఇన్‌ఫెక్షన్ మనుషులు ఒకరికి ఒకరు నేరుగా వ్యాపించదు. కుట్టినప్పుడు మాత్రమే సోకుతుంది.
2/6స్క్రబ్ టైఫస్ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఏమిటంటే:
జ్వరం,కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు తలనొప్పి, శరీరం నొప్పులు, వాంతులు,పొడి దగ్గు బలహీనత్వం
3/6సకాలంలో చికిత్స అందించకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకమవుతుంది. కిడ్నీ సమస్యలు, శ్వాసలో ఇబ్బంది, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు, కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది వైద్యుల ప్రకారం, చికిత్స ఆలస్యమైతే మరణాల రేటు 30% వరకు ఉండొచ్చు. త్వరగా చికిత్స తీసుకుంటే ప్రమాదం 2% వరకు తగ్గుతుంది.
4/6గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారు, పొలాల్లో తిరిగేవారు, పశువులను చూసుకునేవారు, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండేవారు.. ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
5/6పచ్చిక, పొదల్లో తిరిగేటప్పుడు పొడవైన బట్టలు ధరించాలి. ఇంటి చుట్టుపక్కల చెత్త, పొదలను శుభ్రం చేయాలి. కీటకనాశినిలను ఉపయోగించాలి. కుట్టిన చోట మచ్చ, దద్దుర్లు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి
6/6ఇప్పటికే ఏపీలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అన్ని జిల్లాల్లో ప్రజలు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వర్షాల సమయంలో నల్లులు త్వరగా పెరుగుతాయి. కాబట్టి వచ్చే రెండు మూడు నెలలు మరింత జాగ్రత్త అవసరం.