SEBI Recruitment: ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ SEBI భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆఫీసర్ గ్రేడ్-ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఇక ఈ నోటిఫికేషన్‌లో ఆఫీసర్ గ్రేడ్-ఏ (అసిస్టెంట్ మేనేజర్) కోసం 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్ 56, లీగల్ 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 22, రీసెర్చ్ అసోసియేట్ 04, ఆఫీషియల్ లాంగ్వేజ్ 3, ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) 2, ఇంజినీరింగ్ (సివిల్) 3.. విభాగాలుగా ఉన్నాయి.
విద్యార్హతలు ఏంటంటే.. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఏ, బి.టెక్/ బీఈ, ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్లికేషన్ ఫీజు.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100 కాగా.. అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000గా నిర్ణయించారు.
ఈ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. 1995, అక్టోబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుంది. ఫేజ్–1, ఫేజ్–2లో ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఫేజ్-3లో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు sebi.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించండి.