Fluffy Poori : చాలామందికి పూరీలు బాగా పొంగాలి అంటే ఎక్కువ నూనె లాగితేనే అది జరుగుతుంది అనుకుంటారు సి కానీ ఒక సీక్రెట్ పదార్థం వెయ్యడం వల్ల పూరీలు చాలా తక్కువ నూనె పీల్చుకోవడమే కాదు.. అడ్వటైజ్మెంట్ లో చూపించినట్టు ఎంతగానో పొంగుతాయి.. మరి ఆ సీక్రెట్ ఏమిటంటే..
1/5పూరీలు అనగానే బాగా పొంగే పూరిలే మన మైండ్ లోకి వస్తాయి. మంచిగా పొంగిన పూరీలు ప్లేట్లో వేసుకొని తింటే ఆ రుచి వేరు. కానీ అంతలా పొంగే పూరీలకు నూనె ఎక్కువ లాగుతుంది అని అపోహ పడతారు అందరూ.
2/5కానీ నూనె ఎక్కువ లాగకుండా పూరీలు బాగా పొంగాలి అంటే ఒక చిన్న సీక్రెట్ పదార్థం వేస్తే చాలు. ఇంతకీ ఆ సీక్రెట్ పదార్థం ఏమిటి అంటే.. రవ్వ.
3/5ముందుగా రెండు కప్పుల గోధుమపిండి తీసుకోవాలి.. అందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు తో పాటు.. రెండు టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేయాలి. ఉప్మా రవ్వ వల్ల.. పూరికి మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అలానే ఉప్మా రవ్వ వెయ్యడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి కూడా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా పాలు అలానే గోరువెచ్చటి నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి.
4/5ఇక ఈ పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని ఆ తరువాత పూరీల లాగా రుద్దుకోవాలి. ఇప్పుడు పొయ్యి బాందలి పట్టి అందులో నూనె పోసుకొని బాగా కాలిన తర్వాత పూరీలు వేసుకోవాలి.
5/5మనం ఈ పిండిలో వేసిన ఉప్మా రవ్వ వల్ల పూరీలు బాగా పొంగుతాయి.. అంతేకాకుండా నూనె కూడా తక్కువగా పీల్చుకుంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కా ఒకసారి పాటించి చూడండి.