Shani Dev Most Favorite 3 Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం పరంగా కొన్ని రాశుల వారికి శని గ్రహం జాతకంలో ఏ స్థానంలో ఉన్న డబ్బు, అదృష్ట అందిస్తుంది. ఎందుకంటే ఆ శని గ్రహానికి ఆ రాశులు అంటే చాలా ఇష్టం. వారు ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు పొందుతారు.
Shani Dev Most Favorite 3 Zodiac Signs: ఏ రాశి వారిపై నైనా శని ప్రభావం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. శని సంచారం చేసినప్పుడు కూడా నెమ్మదిగా అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని మంచి ప్రభావం ఉన్న రాశుల వారికి దీర్ఘకాలికంగా చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. అదే ఈ గ్రహం జాతకంలో అశుభ స్థానంలో ఉంటే తీవ్ర సమస్యలు తప్పవు.. ఆర్థికంగా చాలా వరకు నష్టపోయే అవకాశాలుంటాయి.
1/6శని దేవుడిని కర్మలను ప్రసాదించే దాతగా కూడా పిలుస్తారు.. ఎందుకంటే బాధపడేవారు ఎలాంటి కర్మలను అనుసరిస్తే.. జీవితంలో కూడా శని అలాంటి ఫలితాలను అందిస్తాడని నమ్ముతారు. ముఖ్యంగా మీరు రోజు వారి జీవితంలో మంచి చేస్తే.. సంపాదన, గౌరవం, వ్యక్తిగత పురోగతి లభిస్తుంది. చెడు చేస్తే సమస్యలు తప్పవు.. ఇదిలా ఉంటే శని దేవుడు కొన్ని రాశుల వారికి జాతకంలో ప్రతికూల స్థానంలో ఉన్న అద్భుతమైన లాభాలను ప్రసాదిస్తాడు. ఎందుకంటే శని దేవుడికి ఆయా రాశులు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.
2/6శని దేవుడు చాలా ఇష్టపడే రాశుల్లో కుంభరాశి ఒకటి అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రాశిని శని దేవుడే పాలిస్తాడు. అందుకే ఆయన అనుగ్రహం, ఆశీస్సులు ఎల్లప్పుడూ వీరికి ఉంటాయి. దీని కారణంగా వీరు కష్టపడి పనిచేసి అఖండ విజయాలు సాధించగలుగుతారు. అలాగే వీరు ఎక్కువగా ఇష్టానుసారంగా పనిచేసేందుకు ఇష్టపడతారు. దీనివల్ల ఆర్థికంగా కూడా మెరుగుపడతారు.
3/6కుంభరాశి వారి ఎల్లప్పుడూ శని అనుగ్రహంతో ఆర్థిక కోరతను చూడకుండా ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో దిమ్మతిరిగే విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా శని అనుగ్రహం వల్ల ఆర్థిక కోరత కూడా తొలగిపోతుంది. అలాగే సంపాదన కూడా అనుకున్న స్థాయిలో పొందగలుగుతారు. ఇలా ఊహించని ధన లాభాలు పొందుతారు.
4/6మకర రాశి వారికి కూడా శని దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి కూడా శని అధిపతిగా ఉంటాడు. కాబట్టి వీరికి ఏలినాటి శని ప్రభావ సమయంలో కూడా శని మేలు చేస్తాడని సమాచారం. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కష్టపడి పనులు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. దీనివల్ల ఆర్థికంగా కూడా బలపడతారు.
5/6మకర రాశి వారికి శని శక్తివంతమైన ఎఫెక్ట్‌తో కష్టాలన్నీ తొలగిపోతాయి. శని దేవుడిని పూజించడం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో నుంచి కూడా ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుంది. అలాగే కష్టపడి పనులు చేస్తే అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా వీరు ప్రశాంతమైన మనసుతో వ్యాపారాలు చేయడం వల్ల ధన లాభాలు కూడా పొందుతారు.
6/6శని దేవుడికి ఎంత ఇష్టమైన రాశుల్లో తులా రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి కూడా శని అనుగ్రహం ఎల్లప్పుడూ కలుగుతుంది. దీని కారణంగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఏకాగ్రత కూడా పెరిగి.. విజయం దిశగా ముందుకు వెళ్తారు. ప్రతి శనివారం శని దేవుడిని పూజిస్తే అనుకున్న లాభాలు బాగా పొందుతారు.