Add Zee Business As A Preferred Source
App

Moola Nakshatra in Navratri 2025: దేవీ నవరాత్రుల్లో మూల నక్షత్రం ఎప్పుడు..?.. ఈ ఒక్కటి చేస్తే చదువు, ఉద్యోగ రంగంలో గొప్పశుభయోగాలు..

Written ByInamdar Paresh
Published: Sep 24, 2025, 06:43 AM IST|Updated: Sep 24, 2025, 06:54 AM IST

Shardiya Navratri 2025: దేవీ శరన్నావరాత్రుల పూజలు దేశ వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. చాలా మంది భక్తిభావనలతో అమ్మవారిని కొలుచుకుంటున్నారు.  భక్తులకు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
 

Shardiya navratri:1/6

దుర్గపూజలు:

హిందు సంప్రదాయంలో శారదీయ నవరాత్రులకు చాలా విశిష్టత ఉంది. ఈ నవరాత్రుల్ని అత్యంత భక్తి భావనలతో, నియమనిష్టలతో జరుపుకుంటారు. చెడుపై మంచి గెలిచిన దానికి సూచికగా దసరా పండగను జరుపుకుంటారు.  

Moola nakshatram:2/6

సరస్వతిపూజలు:

అయితే.. నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రూపాల్లో మనకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో అన్ని రోజులు కూడా అత్యంత ముఖ్యమైనవి. కానీ దానిలో మూల నక్షత్రం వచ్చే రోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైందని పండితులు చెబుతారు. ఈ మూల నక్షత్రం అనేది మహాసరస్వతి అమ్మవారి జన్మనక్షత్రం. అందుకే దీని అంతటి మహత్తు ఉంది.  

durga pooja:3/6

మూల నక్షత్రం:

ఈసారి మనం మూల నక్షత్రంను సెప్టెంబర్ 30న మూల నక్షత్రం పూజల్ని జరుపుకోబోతున్నాం. ఈ రోజున దుర్గమ్మతల్లిని సరస్వతి అమ్మవారిలా అలంకరణ చేస్తారు. ఈరోజు చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటారు. అంతే కాకుండా తమ పిల్లలకు పలక మీద ఓంకారంను కూడా గుడిలో వెళ్లి పూజారులతో రాయించుకుంటారు.   

shardiya navratri pooja:5/6

శరన్నావరాత్రులు దుర్గాపూజలు:

ఈ క్రమంలో మూల నక్షత్రంరోజు మిగత రోజుల్లో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాల కంటే.. వెయ్యి రెట్లు గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. అందుకే చాలా మంది మూల నక్షత్రంరోజున శక్తి పీఠాలు కానీ అమ్మవారి ఆలయాలను దర్శించుకుంటారు.

Dussehra pooja:6/6

దుర్గపూజలు:

మూల నక్షత్రం రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. ముఖ్యంగా..ఈ రోజున చిన్న పిల్లలకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ చేస్తే చదువులో వస్తున్న ఆటంకాలు అన్ని కూడా దూరమౌతాయి. అంతే కాకుండా విద్యా, ఉద్యోగ రంగంలో అత్యద్భుతంగా రాణిస్తారు.