Sasta Graha Kutami 2025 Effect: చాలా ఏళ్ల తర్వాత మార్చి నెలలో మహా సంయోగం ఏర్పడబోతోంది. ఈ మహా సంయోగం వల్ల కొన్ని రాశుల వారు అద్భుతమైన లాభాలు పొందబోతున్నారు. ఇదే సమయంలో లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారు ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు పొందుతారు.
Sasta Graha Kutami 2025 Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో కొన్ని అరుదైన గ్రహాలు సంచారం చేయడమే కాకుండా మహా సంయోగాలు కూడా జరగబోతున్నాయి. రెండు గ్రహాలు ఒక రాశిలో కలిస్తే సంయోగమైతే.. కొన్ని గ్రహాలు ఒకే రాశులు కలయిక జరగడాన్ని మహాసంయోగంగా పిలుస్తారు. మహా సంయోగం ఏర్పడినప్పుడు అన్ని రాశుల వారిపై ఎంతో శక్తివంతమైన ఎఫెక్ట్ పడుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీన రాశిలో రాహు గ్రహంతో పాటు బుధుడు చంద్రుడు, శుక్రుడు గ్రహాలు కలయిక జరపబోతున్నాయి.
ఒకే రాశిలో ఈ గ్రహాల కలయిక వల్ల ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో పాటు మరికొన్ని రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీనివల్ల ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన రాశుల వారికి కెరీర్, ఆర్థికపరంగా వస్తున్న సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. అలాగే జీవితంలో ఒక అద్భుతం జరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో పాటు మహా సంయోగం ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ఆదాయపరంగా వస్తున్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అలాగే భారీ మొత్తంలో లాభాలను అర్జించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి కోరికలు కూడా నెరవేరుతాయి.
మిధున రాశి వారికి కూడా మహా సంయోగం ఎఫెక్ట్ వల్ల ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి వ్యాపార పరంగా వస్తున్న సమస్యలు తొలగిపోయి. ఆర్థికంగా కూడా కొన్ని లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు లభించి జీతాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. అలాగే వీరు కొన్ని శుభవార్తలు కూడా వినగలుగుతారు.
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పూర్తిగా పెరిగి అనుకున్న పనులు విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారి కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే వీరికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగి మంచి మానసిక శక్తిని పొందగలుగుతారు. ఇక చాలాకాలంగా వస్తున్న సమస్యలు కూడా కొన్ని పరిష్కారం అవుతాయి.
కన్యా రాశి వారికి కూడా ఈ సమయంలో ఏర్పడే శక్తివంతమైన మహా సంయోగం వల్ల కోర్టు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయం అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. అలాగే వ్యాపారాల్లో పు
ధనస్సు రాశి వారికి కూడా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వృత్తి జీవితం గడుపుతున్న వారికి అనుకున్న దాని కంటే ఎక్కువగానే ఆదాయం వస్తుంది. అలాగే అత్తమామల నుంచి సపోర్టు లభించి కోడలు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా చాలావరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.