Shhyamali About Samantha : ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరికి మాజీ భార్య అయిన శ్యామలీ డే..డిసెంబర్ 1న రాజ్–సమంతా రూత్ ప్రభు వివాహ వార్త బయటకు వచ్చిన.. తర్వాత మొదటిసారి స్పందించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగపూరిత నోట్ రాస్తూ.. ఈ సమయంలో తనకు అందుతున్న ప్రేమ.. ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.
1/6శ్యామలీ డే సమంత, రాజ్ పెళ్లి చేసుకునే మరుసటి రోజు వారిద్దరి పెళ్లి గురించి ఇంస్టాగ్రామ్ లో ఒక పెద్ద పోస్ట్ పెడుతూ స్పందించింది. తనకు అభిమానుల దగ్గర నుంచి వస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. “మీ అందరి ప్రేమకు.. ధన్యవాదాలు.. మీ శుభాకాంక్షలు, మీ స్నేహపూర్వక మాటలు..మీ ఆశీర్వాదాలు నాకు ఎంతో బలం ఇస్తున్నాయి” అని ప్రారంభించారు.
2/6సమంత, రాజ్ పెళ్లి చేసుకున్న రోజు రాత్రి ఆమెకు చాలా కష్టంగా జరిచింది అని ఇన్ డైరెక్ట్ గా చెబుతూ....“రాత్రంతా నిద్ర రాక తిరగాడుతూ గడిపాను. నా దగ్గరకు వస్తున్న ప్రేమకు.. ధన్యవాదాలు చెబుతానా లేదా అని నేను నాతోనే వాదించుకున్నాను” అని తెలిపారు.
3/6అలానే అనేక సంవత్సరాలుగా తన ధ్యానం చేస్తున్నానని.. ముఖ్యంగా “ట్విన్ హార్ట్స్ మెడిటేషన్” తనను ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పింది. ఆమెకి “క్షమ, ఆశ, వెలుగు, ఆనందం, ప్రేమ, దయ..మంచి చేయాలనే సంకల్పం” వంటి విలువలు ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ రోజు తనకు వస్తున్న సానుకూలత తనే పంపిన శక్తి తిరిగి వస్తోందని ఆమె భావిస్తున్నట్లు తెలిపారు.
4/6తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను పూర్తిగా తానే నిర్వహిస్తానని ఆమె స్పష్టం చేశారు. “నా పేజ్‌ను నడిపేది ఎవరూ లేరు. టీమ్, పిఆర్, సిబ్బంది ఎవరూ లేరు. నా జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలను ఎదుర్కొంటూ నేను స్వయంగా స్పందిస్తున్నాను” అని చెప్పింది.
5/6ఇప్పుడు తాను ఎదుర్కొంటున్న వ్యక్తిగత విషాదాన్ని కూడా ఆమె వెల్లడించారు. “నవంబర్ 9న నా జ్యోతిష్య గురువుకి స్టేజ్ 4 క్యాన్సర్ అని నిర్ధారించారు. అది బ్రెయిన్ సహా శరీరంలోని అనేక భాగాలకు వ్యాపించింది” అని ఆమె చెప్పారు. ఈ పరిస్థితి వల్ల తన పూర్తి దృష్టి గురువుతో ఉండడంపైనే ఉందన్నారు.
6/6చివరిగా, శ్యామలీ అందరికీ .. “దయచేసి ఈ స్పేస్ ని ప్రశాంతంగా ఉంచండి.”.. అని తెలుపుతూ తన పోస్ట్ ని హృదయపూర్వక ధన్యవాదాలతో ముగించారు: “థ్యాంక్ యూ… థ్యాంక్ యూ… థ్యాంక్ యూ.” అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, సంపద, ఆధ్యాత్మికత కలగాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.