Bastian Bandra Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. ముంబైలోని ఫెమస్ బాంద్రా రెస్టారెంట్ ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మరోసారి ఈ జంట వార్తలలో నిలిచారు.
1/6బాలీవుడ్ ఫెమస్ జంట శిల్లాశెట్టి, రాజ్ కుంద్రా తరచుగా వార్తలలో ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల ఈ దంపతులపై రూ. 60 కోట్ల భారీమోసంపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ వివాదం సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారంగా మారిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో శిల్పాశెట్టి సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. ముంబైలో ఎంతో పేరుగాంచిన తన ‘బాస్టియన్’ రెస్టారెంట్‌ను.. శాశ్వతంగా మూసివేస్తున్నట్లు శిల్పాశెట్టి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
2/6ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్‌లో భావోద్వేగంగా అభిమానులతో పలు విషయాలు పంచుకున్నారు. ముంబైలో ఎంతో ఫెమస్ అయిన, అభిమానుల్ని సంపాదించుకున్న బాస్టియన్ రెస్టారెంట్ ను గురువారం నుంచి క్లోజ్ చేస్తునట్లు చెప్పుకొచ్చారు. దీనితో తమకు ఎంతో అనుబంధం ఉందని, లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలను అందించిందని శిల్పాశెట్టి భావోద్వేగానికి గురయ్యారు .
3/6ఈ క్రమంలో అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని శిల్పాశెట్టి ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా.. చివరిసారిగా గురువారం నాడు ఒక ప్రత్యేక వేడుకను నిర్వహిస్తున్నామని, దీనికి వ్యాపార భాగస్వాములు, సన్నిహితులు హాజరవుతారని ఆమె వెల్లడించారు.
4/6అంతే కాకుండా.. తొందరలోనే.. సరికొత్త అనుభవాలతో మళ్లీ మీ ముందుకు వస్తామని బాలీవుడ్ భామ శిల్పాశెట్టి తన పోస్ట్‌లో కీలక విషయాల్ని వెల్లడించారు. మరోవైపు ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటునే.. బాస్టియన్ పేరుతో రెస్టారెంట్ ను స్టార్ట్ చేశామని, ఇది అనతి కాలంలోనే ముంబై వాసులకు బెస్ట్ స్పాట్ గా మారిందన్నారు.
5/6ముంబైలోకి బాస్టియన్ కు ఆరు బ్రాంచ్ లు ఉన్నాయన్నారు. ప్రతిరోజు కూడా సామాన్యుల నుంచి సెలబ్రీటీల వరకు అందరు ఇక్కడకు వస్తుంటారని కూడా శిల్పాశెట్టి చెప్పుకొవచ్చారు. అయితే.. ఈ రెస్టారెంట్ ను మూసివేత నిర్ణయంపై దీపక్ కోఠారి ఫిర్యాదు కారణమని తెలుస్తొంది.
6/6శిల్పాశెట్టి దంపతులపై ముంబైకి చెందిన దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడి ఒప్పందం పేరుతో తనను రూ.60 కోట్లకు మోసం చేశారని సదరు వ్యాపార వేత్త ఆరోపణలు గుప్పించాడు. ప్రస్తుతం శిల్పాశెట్టి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.