Sobhita first love
నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకునే ముందు శోభిత ధూళిపాళ ఎవరితో ప్రేమలో ఉన్నారో తెలుసా? తన మొదటి క్రష్ ఎవరు? స్కూల్, కాలేజ్ రోజుల్లో ఆమె ప్రేమ గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.
శోభిత ధూళిపాళ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. ఇప్పుడు అక్కినేని కుటుంబానికి కోడలిగా మారిన ఆమె, నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు రెండు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, చివరకు అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి జరగడం పట్ల అక్కినేని నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ తన మొదటి క్రష్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. స్కూల్‌లో చదువుకునే రోజుల్లో తన క్లాస్ సీఆర్ సార్ అంటే ఎంతో ఇష్టమని, అతని దృష్టిలో పడేందుకు వ్యాసరచన పోటీల్లో పాల్గొనేదానని తెలిపింది. కానీ, అది ప్రేమనా లేదా కేవలం క్రష్ అని చెప్పలేనని పేర్కొంది.
అతను తనను పట్టించుకోలేదనే కారణంగా చాలా బాధపడ్డానని శోభిత చెప్పింది. కాలేజీ రోజుల్లో కొందరు ప్రేమలేఖలు రాసేవారని, తాను కూడా కొన్ని రాశానని ఆమె తెలిపింది. అయితే, వయస్సు పెరిగేకొద్దీ మెచ్యూరిటీ వచ్చినట్లు వెల్లడించింది. కాగా అప్పట్లో శోభిత కి నాగచైతన్య కన్నా ముందు వేరే వ్యక్తితో ఆఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు షోకి ఇలా చెప్పిన మాటలను బట్టి వింటే.. స్కూల్లో క్రష్ ఉన్నారు కానీ ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి వచ్చాక ప్రేమించిన మాత్రం నాగచైతన్యనే అని అర్థమవుతుంది.
నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డారు. ఇరువురూ ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకుని, కుటుంబ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం ముంబయిలో ఎక్కువగా ఉంటూ, కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. వ్యక్తిగతంగా ఒంటరిగానే జీవిస్తున్న ఆమె, కెరీర్‌పైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలుగులో ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాల్లో నటించిన శోభిత, ఇప్పుడు ‘గూఢచారి 2’లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆమె, గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందినవారు.