Fingerprint Unlock Dead Person: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్స్ ఉంటున్నాయి. ఇక మొబైల్ సేఫ్టీ కోసం అందరూ ఈజీగా ఉండే ఫింగర్ ప్రింట్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే ఎవరైనా చనిపోతే వారి ఫింగర్ ఫ్రింట్స్‌తో ఫోన్ అన్‌లాక్ అవుతుందా..? కాదా..? అని చాలా మందికి డౌట్ వస్తుంది. మరి నిజంగానే ఓ వ్యక్తి మరణించాక ఫోన్ లాక్ తీయొచ్చా, లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1/5ప్రతి వ్యక్తి థంబ్ వేరువేరుగా ఉంటుంది. అయితే మరణానంతరం ఫోన్ అన్‌లాక్ అవుతుందా..?మరణించిన వ్యక్తి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్ అవుతుందా..? అనేది ఫోన్లలో ఉపయోగించే సెన్సార్ రకం, మరణించినప్పటి నుండి గడిచిన టైమ్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది.
2/5ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో ప్రధానంగా మూడు రకాల ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు వాడుతున్నారు. అవేంటంటే.. ఆప్టికల్, కెపాసిటివ్, అల్ట్రాసోనిక్. ప్రతి సెన్సార్‌కి తనదైన సాంకేతికత మరియు ప్రయోజనాలు ఉన్నాయి.
3/5మరణానంతరం మొదటి కొన్ని గంటల్లో, చర్మం ఇంకా మృదువుగా ఉండే సమయంలో.. కొన్ని సందర్భాల్లో ఆప్టికల్ లేదా కెపాసిటివ్ సెన్సార్లు తాత్కాలికంగా పనిచేయవచ్చు.
4/5అయితే 12 నుండి 24 గంటలు గడిచిన తర్వాత పరిస్థితి మారుతుంది. చర్మం కుచించుకుపోవడం, తేమ కోల్పోవడం, విద్యుత్ వాహకత తగ్గిపోవడం మొదలవుతాయి. దీంతో కెపాసిటివ్ సెన్సార్ పూర్తిగా విఫలమవుతుంది.
5/5ఇలా జరగడం వల్ల ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్ పనిచేయదు. అలాగే ఆప్టికల్, అల్ట్రాసోనిక్ సెన్సార్లు బ్లడ్ ఫ్లో లేకపోవడాన్ని గుర్తించి.. వెంటనే ఫోన్ అన్‌లాక్‌ని తిరస్కరిస్తాయి.