Shriya Assets: రెండు దశాబ్దాలకు పైగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన నటి శ్రియ. కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు మళ్ళీ మిరాయి చిత్రంతో తిరిగి కం బ్యాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే..
1/6తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది శ్రియ. 1982లో జన్మించిన ఆమె 2001లో ఇష్టం అనే తెలుగు చిత్రంతో తెరంగేట్రం చేసింది. తర్వాత సంతోషం, శివాజీ: ది బాస్ (రజనీకాంత్ సరసన), నేనునన్ను వంటి హిట్ సినిమాలతో గుర్తింపు పొందింది.
2/6తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించి విస్తృతమైన అభిమానులను సంపాదించింది. ప్రస్తుతం 43 ఏళ్లు దాటినా.. ఆమె ఆకర్షణ తగ్గలేదని చెప్పాలి. సోషల్ మీడియాలో పంచుకునే ఫొటోలు కూడా అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.
3/6కళాకారిణిగా మాత్రమే కాకుండా శిక్షణ పొందిన కథక్ నర్తకిగా కూడా శ్రీయా ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ వేదికలపై.. ఆమె నృత్య ప్రదర్శనలు ప్రశంసలు పొందాయి. సౌత్ ఇండియన్ సినీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరుగా శ్రీయ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఒక్కో సినిమాకు సుమారు రూ.3–4 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం.
4/6సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ప్రకటనల ద్వారా కూడా మంచి ఆదాయం సంపాదిస్తోంది. ఆమె మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.80 కోట్లు ఉండవచ్చని అంచనా.ముంబైలోనే భర్త, రష్యన్ టెన్నిస్ ప్లేయర్.. వ్యాపారవేత్త ఆండ్రే కోశ్చీవ్, కుమార్తె రాధాతో కలిసి నివసిస్తోంది. వారి ఇల్లు స్టైలిష్‌గా, విలాసవంతంగా ఉండి ఆమె లైఫ్‌స్టైల్‌కి ప్రతిబింబంగా నిలుస్తోంది.
5/6శ్రియకు ప్రత్యేకమైన ఇష్టం. ఆమె గ్యారేజీలో ఉన్న విలాసవంతమైన కార్లు:
ఆడి A6 – రూ.65 లక్షలు మెర్సిడెస్ బెంజ్ GLE – రూ.1 కోటి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ – రూ.12 లక్షలు బిఎండబ్ల్యూ 7 సిరీస్ – రూ.1.7 కోట్లు
6/6ఇక ప్రస్తుతం శ్రియ నటించిన మిరాయి చిత్రం.. మంచి విజయం సాధించడంతో ఇకమీదట ఆమెకు తెలుగులో మళ్లీ వరస అవకాశాలు రావడం ఖాయంలా కనిపిస్తోంది.