Shukra Gochar: శుక్ర గోచారంతో ఈ రాశుల వారికి అనుకోని ధన యోగం.. అబ్బబ్బ లక్కంటే ఈ రాశులదే..

Shukra Gochar: నవంబర్ 16 నుండి 23 వరకు శుక్రుడు తన స్థానిక రాశి తులారాశిలో ఏ ఇతర గ్రహాలతో సంబంధం లేకుండా ఒంటరిగా సంచరిస్తూ ఉంటాడు. ఏదైనా గ్రహం ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు లేదా ఇతర గ్రహాల దృష్టితో ఉన్నప్పుడు..అది శుభాశుభా ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. 

 

1 /8

Shukra Gochar: శుక్రుడు బలహీనమైన సూర్యుని ప్రభావం నుండి బయటకు వచ్చాడు. శుక్రుడు ఒంటరిగా ఉండటం వలన మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరరాశిలో జన్మించిన వారికి రాజయోగం, ధన యోగం యొక్క ఎక్కువ ప్రయోజనాలు అందుకునే అవకాశాలున్నాయి. 

2 /8

తులా రాశి: తులా రాశిలో శుక్రుడు సంచారం వలన ఈ రాశి వారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రముఖులతో  సంబంధాలు మెరుగవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉండబోతుంది.త్వరలో లక్ష్మీ దేవి అనుగ్రహంతో ధనవంతులు అయ్యే యోగం ఏర్పడుతుంది.  సామాజిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆదాయ యోగం లభిస్తుంది.వివాహా జీవితంలో సమస్యలు పరిష్కరించబడతాయి. ఫ్యామిలీలో  ఆనందం వెల్లివరుస్తుంది.   

3 /8

కర్కాటక రాశి: కర్కాటక రాశి యొక్క నాల్గవ ఇంట్లో శుక్రుడు ఉండటం మూలాన  ఏర్పడిన మాలవ్య మహా పురుష యోగం పూర్తి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలోనే కాదు.. సామాజిక హోదా లభిస్తుంది. కుటుంబంలో శుభ సంఘటనలతో పాటు అపారమైన ఆనందం వెల్లి విరుస్తుంది. గృహ,  వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి సమస్యలు పరిష్కరించబడతాయి. నిరుద్యోగులకు విదేశీ యానం చేయబోతున్నారు. విదేశీ బహుమతులు కూడా లభించబోతున్నాయి. అవివాహితులకు ఉన్నత కుటుంబంతో వివాహ యోగం సిద్దిస్తుంది. 

4 /8

మకర రాశి: ఈ రాశి వారికి పదవ ఇంట్లో శుక్రుడు సంచారం వలన మాలవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది.  ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. కొత్త అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయి ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. 

5 /8

కన్య రాశి: కన్య రాశికి అత్యంత శుభ గ్రహం అయిన శుక్రుడు సంపద ఇంట్లో సంచరిస్తున్నాడు.  కాబట్టి ఈ రాశి చక్రానికి వచ్చే ప్రతిదీ బంగారంగా మారుతుంది. సంపద, శ్రేయస్సుకు మంచి అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇంట్లో వివాహం,  గృహ ప్రవేశం వంటి శుభ సంఘటనలు జరుగుతాయి. ఈ రాశి యొక్క సలహాలు, సూచనల నుండి అధికారులు గరిష్ట ప్రయోజనం పొందుతారు. కెరీర్, వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అన్ని రకాలుగా  ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కరించబడతాయి.

6 /8

మేష రాశి: మేష రాశి యొక్క ఏడవ ఇంట్లో శుక్ర సంచారము కారణంగా, ఈ రాశి వారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది. ఈ యోగం పూర్తి ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ యోగం వలన సమాజంలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. ఇది ఉద్యోగంలో అధికారాన్ని నిలబడుతుంది. కెరీర్, వ్యాపారం లాభదాయకంగా ఉండబోతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ బహుమతులు లభిస్తాయి. ధనిక కుటుంబంతో వారితో ఈ రాశి వారికి వివాహం సెట్ అవుతోంది. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉండబోతుంది.

7 /8

ధనుస్సు రాశి: శుక్రుడు శుభ స్థానంలో సంచరిస్తున్నందున, ధనుస్సు రాశి వారికి కనీస ప్రయత్నంతో గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు అందుకోబోతున్నారు.  జీవితంలో ఊహించని శుభ పరిణామాలు అందుకుంటాయి. పనిలో పదోన్నతులతో పాటు, జీత భత్యాలు అందుకుంటారు. కెరీర్ పరంగా  వ్యాపారంలో లాభాలను అందుకుంటారు.  స్టాక్స్, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు మంచి లాభాలను తీసుకొస్తాయి. సంపన్న కుటుంబంతో మీ వివాహ యోగం సిద్దిస్తుంది.   

8 /8

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించబడింది. జీ న్యూస్ దీనిని నిర్ధారించలేదు.