Add Zee Business As A Preferred Source
App

SIIMA 2025: సైమా సినీ జాతరలో పుష్పగాడు దున్నేశాడు.. వైరల్‌ అవుతున్న సినీ తారల ఫోటోలు..!

Written ByRenuka Godugu
Published: Sep 06, 2025, 07:34 AM IST|Updated: Sep 06, 2025, 07:37 AM IST

SIIMA 2025 Photos: సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) కార్యక్రమం దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, నటులు ,టెక్నీషియన్స్ అందరు హాజరయ్యారు. ఈ సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో మెరిసిన తారల ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 
 

Rashmika Mandanna1/7

రష్మిక మందన

సైమా అవార్డ్స్ లో అల్లు అర్జున్ ,రష్మిక మందన, మీనాక్షి చౌదరి, శ్రీయ,అల్లు శిరీష్, సందీప్ కిషన్, పాయల్ రాజపుత్‌ తదితరులు సందడి చేశారు   

cine Industry2/7

సినీ ఇండస్ట్రీ

ఈ అవార్డు ఫంక్షన్‌ దుబాయ్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హీరో హీరోయిన్లు అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.   

Box Office3/7

బాక్సాఫీస్

 ఇక సైమా అవార్డ్స్ ఫంక్షన్లో పుష్ప రూల్ మామూలుగా లేదు. బాక్సాఫీస్ వద్దే కాదు సైమా అవార్డ్ ఫంక్షన్ లో కూడా షేక్ చేసింది. బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డు అల్లు అర్జున్ అందుకోగా బెస్ట్ డైరెక్టర్ అవార్డును సుకుమార్ సొంతం చేసుకున్నారు.   

Pushpa24/7

పుష్ప2

 ఇక బెస్ట్ ఫిమేల్ యాక్టర్ రష్మిక, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సైతం పుష్ప2కే అవార్డులు పొందారు. అటు బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డును తేజ (హనుమాన్) సినిమాకు గాను తీసుకున్నారు. ఇక బెస్ట్ యాక్టర్ ఫిమేల్ డిబ్యూటెంట్ అవార్డును భాగ్యశ్రీ గెలిచారు   

Konidela Niharika5/7

నిహారిక కొణిదెల

 ఇక నిహారిక కొణిదెలకు కూడా కమిటీ కుర్రాళ్ళు సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ గా ఆమె అవార్డు అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అమితాబ్‌ బచ్చన్ కల్కి సినిమాకు పొందారు. ద బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ లో మేల్‌ క్యాటగిరీ కమల్ హాసన్ కల్కీ మూవీకి పొందారు   

Award Function6/7

అవార్డు వేడుక

ఈ అవార్డు వేడుక ప్రతి ఏడాది అంతకుముందు సంవత్సరంలో విశేష ప్రతిభ చూపించిన నటీనటులకు ఈ అవార్డులు అందిస్తారు. ఇక సైన్స్ ఫిక్షన్ మూవీ లో అందరిని ఆకట్టుకున్న కల్కి 2898 మూవీ ఉత్తమ చిత్రం గా నిలిచింది.  పుష్ప 2 మొత్తానికి 4 అవార్డులను తన ఖాతాలో దక్కించుకుంది.  

Dubai7/7

దుబాయ్

దుబాయ్ వేడుక వేదికగా అంగరంగ వైభవంగా మొత్తం సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మొత్తం ఈ వేడుకకు హాజరవుతారు. తెలుగు, కన్నడ చిత్రాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులకు మొదటి రోజు ఎక్కువ మొత్తంలో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.